ETV Bharat / entertainment

'కార్తికేయ' నటుడి ఆఫీస్​లో చోరీ - సినిమా నెగిటివ్ ఎత్తుకెళ్లిన దొంగలు - Theft In Anupam Kher Office

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 6:59 AM IST

Updated : Jun 21, 2024, 7:24 AM IST

Theft In Anupam Kher Office : బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్​లో తాజాగా చోరీ జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న ఓ మూవీ నెగిటివ్​తో పాటు సేఫ్​ లాకర్​ను ఎత్తుకెళ్లారు. ఇంతకీ ఈ చోరీ ఎలా జరిగిదంటే?

Theft In Anupam Kher Office
Anupam Kher (ANI)

Theft In Anupam Kher Office : బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్​లో తాజాగా దొంగలు తమ చేతివాటం చూపించారు. ఈ ఘటనలో డబ్బులను దాచే సేఫ్​ లాకర్​తో పాటు ఓ మూవీ నెగెటివ్​ను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఇంతకీ చోరీ ఎలా జరిగిందంటే?
అనుపమ్​ ఖేర్ చెప్పిన వివరాల ప్రకారం ముంబయిలోని వీర దేశాయ్ రోడ్‌లోని అనుపమ్​ ఖేర్ ఆఫీస్​లో ఎవ్వరూ లేని సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి ఆఫీస్​ డోర్​ పగులగొట్టారు. ఆ తర్వాత అక్కడే ఉన్న లాకర్​తో పాటు ఓ ఫిల్మ్​ నెగిటివ్​ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఓ ఆటోలో పరారయ్యారు ఇవన్నీ కూడా ఆఫీస్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల అసలు విషయం బయటపడింది.

దీంతో అనుపమ్ ఖేర్ ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారట. ఈ విషయాలన్నింటినీ అనుపమ్​ ఖేర్ ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో తెలిపారు. అందులో ఆ దొంగలు ఆ డోర్​ను పగులగొట్టిన దృశ్యాలను చూపించారు. త్వరలోనే ఆ దొంగల్ని పట్టుకుంటామంటూ తెలిపిన ఆయన, తన వద్గ ఆటో నంబర్ కూడా ఉందని అన్నారు. ఆ దొంగలకు ఆ దేవుడే మంచి బుద్ధిని ప్రసాదించాలని అనుపమ్ ఖేర్ ఆ పోస్ట్​లో పేర్కొన్నారు.

ఇక అనుపమ్ ఖేర్ కెరీర్ విషయానికి వస్తే, బాలీవుడ్​లో తన నటనతో ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్, టాలీవుడ్​లోనూ మంచి గుర్తింపు పొందారు. 'కార్తికేయ 2', 'టైగర్ నాగేశ్వరరావు' లాంటి చిత్రాలతో ఇక్కడి వారికి దగ్గరయ్యారు. ముఖ్యంగా 'కార్తికేయ 2'లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆయన 'ది సిగ్నేచర్​' అనే హిందీ సినిమాతో 'విజయ్ 69' అనే సినిమాలో నటించారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలు రిలీజ్​కు సిద్ధమవుతున్నాయి.

'నా పిల్లల కన్నా మోదీనే ఇష్టం'.. స్టార్ నటుడి తల్లి పోస్ట్.. కంగన రియాక్షన్ ఇదే!

'కార్తికేయ 2'లో బాలీవుడ్​ నటుడు.. ఎవరంటే?

Last Updated : Jun 21, 2024, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.