Amaran Movie Box Office Collection : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'అమరన్' మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి టాక్‌తో నడుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిందట. అంతే కాకుంకా శివ కార్తికేయన్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ గ్రాసర్ ఇదే కావటం విశేషం.
మరోవైపు వీకెండ్స్ అలాగే ఈ సినిమాకు ఉన్న మంచి టాక్ వల్ల మరింత ఎక్కువ కలెక్షన్స్ రావడం ఖాయమని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కోలీవుడ్‌లోనూ మంచి సక్సెస్‌తో దూసుకెళ్లడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మారిందట.
2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ 'ముకుంద్ వరద రాజన్' జీవిత కథతో రూపొందిన చిత్రమే 'అమరన్'. వరదరాజన్‌గా శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయిపల్లవి నటించారు.
కథేంటంటే :
హీరో ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) తాను సైనికుడు కావాలని ఐదేళ్ల నుంచే కలలు కంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు రెబెకా వర్ఘీస్ (సాయిపల్లవి)తో ప్రేమలో పడతాడు. ఇంతలో భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్ అధికారిగా ఉద్యోగానికి ఎంపికవుతాడు. ట్రైనింగ్ అనంతరం 22 రాజ్‌పుత్ రెజిమెంట్‌లో విధుల్లో చేరతాడు. ముకుంద్ ఇంట్లో వీళ్ల ప్రేమని ఒప్పుకున్నా, ఇందు ఇంట్లో తిరస్కరిస్తారు.
అయినా ఇందు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఒక్కటవుతారు. ఆ తర్వాత ఇద్దరి వ్యక్తిగత జీవితం ఎలా సాగింది?ముకుంద్ వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నాడు? మేజర్‌గా ప్రమోషన్ వచ్చి రాజ్‌పుత్ రెజిమెంట్ నుంచి రాష్ట్రీయ రైఫిల్స్‌కి డిప్యుటేషన్‌పై వచ్చాక ఆయన ఎలాంటి ఆపరేషన్లని నిర్వహించాడనేది తెరపై చూడాల్సిందే.
గమనిక : పైన చెప్పిన వసూళ్లు అధికారిక లెక్కలు కాదు. ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు, ట్రేడ్ విశ్లేషకుల ట్వీట్లు ఆధారంగా రాసినవి.