ETV Bharat / entertainment

అల్లు అర్జున్ గ్రేటెస్ట్ రికార్డ్​ - సౌత్ ఇండియా నుంచి తొలి హీరోగా! - Alluarjun Instagram Record - ALLUARJUN INSTAGRAM RECORD

Alluarjun Instagram Record : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్​కు సౌతిండియాలో అవధులు లేవు. పుష్పలాంటి బ్లాక్ బస్టర్ హిట్​తో తన పాపులారిటీని ఇక్కడే కాదు నార్త్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేశాడు. ఫ్యాన్స్​ బన్నీని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఈయన తాజాగా మరో సంచలన రికార్డు క్రియేట్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్​లో సౌతిండియా హీరోలెవరికీ సాధ్యం కానీ రేర్ ఫీట్​ను ఐకాన్ స్టార్ సాధించాడు. అదేంటంటే?

అల్లు అర్జున్ గ్రేటెస్ట్ రికార్డ్​ - సౌత్ ఇండియా నుంచి తొలి హీరోగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 12:13 PM IST

Alluarjun Instagram Record : సౌతిండియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు ఉన్న పాపులారిటీ, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బన్నీ యాక్టింగ్, డ్యాన్స్, స్టైల్​ అంటే ఫ్యాన్స్ పడిచచ్చిపోతారు. ఇక పుష్ప మూవీ తర్వాత ఆ క్రేజ్ మరో లెవల్ కు చేరింది. ఈ మూవీతో నార్​తో కూడా బన్నీ తన సత్తా చాటారు. అసలు ఏమాత్రం అంచనాలు, ప్రమోషన్స్ లేకుండానే హిందీలో రిలీజ్ అయిన ఈ మూవీని చూసిన అక్కడి ఫ్యాన్స్ బన్నీకి పిచ్చా ఫ్యాన్స్ అయ్యారు. వాస్తవం చెప్పాలంటే తెలుగు కన్నా హిందీలోనే ఈ మూవీ మార్కెట్ ఎక్కువగా సంపాదించుకుంది.

ఈ మూవీతో మొత్తం భారతదేశంలో అల్లు అర్జున్ ఫాలోయింగ్ ఎంతగా పెరిగిందంటే మాటల్లో చెప్పలేం. అయితే తాజాగా మరో సంచలనం క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్​లో సౌతిండియా హీరోలెవరికీ సాధ్యం కానీ ఫీట్​ను సాధించాడు బన్నీ. అదేంటంటే ప్రజెంట్ ఇన్ స్టాగ్రామ్​లో ఐకాన్ స్టార్​ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 25 మిలియన్లు దాటింది. ఆ విధంగా దక్షిణాదిలో 25మిలియన్ల ఫాలోవర్స్​ను కలిగిన మొదటి, హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. తర్వాత స్థానంలో 21.3 మిలియన్లతో విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ 20.8. దుల్కర్ సల్మన్ 14.1, 11.7 ప్రభాస్, 10.8 మిలియన్లతో దళపతి విజయ్ ఉన్నారు. ఇంతమంది స్టార్ హీరోలను దాటుకుని టాప్​లో నిలిచారు అల్లు అర్జున్.

ఇక అటు పుష్ప 2 మూవీ పనుల్లో బిజీగా గడుపుతున్నారు బన్నీ. ఈ సినిమా నుంచి బయటకు వస్తున్న లీకులు కూడా ఈ సినిమా మీద భారీగానే అంచనాలను పెంచుతున్నాయి. శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనుంది. దీనికి సంబంధించిన లుక్ ఒకటి తాజాగా రిలీజ్ అయింది. ఒంటి నిండా నగలతో మెరిసిపోతున్నట్లు కనిపిస్తున్న రష్మిక లుక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా యాగంటిలో షూటింగ్ జరుపుకుంటోంది.

జపాన్​లో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజమౌళి కొడుకు! - లేదంటేనా?

సమంతను చూసి భయపడిపోయాను - తను అలాంటి వ్యక్తి! : సుహాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.