ETV Bharat / entertainment

అదీ సార్​ ఐకాన్ స్టార్ బ్రాండ్​ - వామ్మో బన్నీ ధరించిన స్వెట్ షర్ట్​ ధర అంతా? - berlin film festival alluarjun

Alluarjun SweatShirt Price : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధరించిన ఓ స్వెట్ షర్ట్ ధర​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దాని ధర విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ వివరాలు.

అదీ సార్​ ఐకాన్ స్టార్ బ్రాండ్​ - వామ్మో బన్నీ ధరించిన స్వెట్ షర్ట్​ ధర అంతా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 11:12 AM IST

Updated : Feb 17, 2024, 11:48 AM IST

Alluarjun SweatShirt Price : ఐకాన్ స్టార్​ హీరో అల్లు అర్జున్ - ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన పేరు వినగానే పుష్ప పుష్ప రాజ్​ అంటూ మేనరిజాన్ని చూపిస్తూ అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ప్రస్తుతం ఇండియా వైడ్​గా ఉన్న మూవీ లవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 మూవీని వారి ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు బన్నీ. దాదాపుగా షూటింగ్​ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ఆగస్ట్ 15న గ్రాండ్​గా ఆడియెన్స్​ ముందుకు రానుంది.

అయితే ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‏లో పుష్ప ది రైజ్ మూవీని స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఈ సందర్భంగా బన్నీ అక్కడికి వెళ్లారు కూడా. అంతకన్నాముందు ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. అప్పుడాయన బుర్బెర్రీ మోనోగ్రామ్ మోటిఫ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ ధరించి కనిపించారు. ఇందులో ఆయన ఎంతో స్టైలిష్​గా కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో ఇది సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఆయన అభిమానులు, నెటిజన్లు దాని ధర కనుగొనేందుకు ఎంతో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దాని ధర నెట్టింట్లో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు. స్టైలిష్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి అని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే తొలి భాగం కన్నా భారీ యాక్షన్ సీన్స్​తో రెండో భాగం పుష్ప 2ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. హీరోయిన్​గా నటిస్తోంది. విలక్షణ నటుడు సునీల్, అనసూయ, మలయాళ స్టార్​ ఫహాద్ ఫాజిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాకింగ్ స్టార్​ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్​ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో పాటు అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్​ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయనున్నారు.

మృణాల్ ఠాకూర్​కు సూపర్ ఆఫర్​ - ఆ ఇద్దరు స్టార్ హీరోల్లో ఒకరితో!

'నా సామి రంగ' - ఈ వీకెండ్​లో మొదలైపోయిన మన్మథుడి మాస్ జాతర

Last Updated : Feb 17, 2024, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.