Pushpa 2 Collection Worldwide : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'పుష్ప రాజ్' రూలింగ్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజే రూ.294 కోట్ల వసూళ్లతో సత్తా చాటిన పుష్ప మొదటి వీకెండ్లో అదే జోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల్లోనే 'పుష్ప ది రూల్' రూ.621 కోట్లు వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వైల్డ్ ఫైర్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఇది నిజంగానే 'పుష్ప రూలింగ్', 'ఇది పుష్ప రేంజ్' అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
అంతటా పుష్ప రూలింగే!
కాగా, భారతీయ సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా పుష్ప అరుదైన రికార్డ్ కొట్టింది. రెండు రోజుల్లోనే పుష్ప ఈ మార్క్ అందుకున్నట్లు మేకర్స్ తెలిపారు. వరల్డ్ వైడ్‌గా 12వేలకు పైగా స్క్రీన్లలో రిలీజైన పుష్ప అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా అన్ని భాషల్లో భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది.
The box office is witnessing history with #Pushpa2TheRule ❤🔥
— Pushpa (@PushpaMovie) December 8, 2024
The WILDFIRE BLOCKBUSTER collects a gross of 621 CRORES WORLDWIDE in just 3 days, shattering many records 💥💥💥
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun… pic.twitter.com/8J2G9sarP6
బాలీవుడ్‌లోనూ టాప్
హిందీలోనూ పుష్ప రూలింగే నడుస్తోంది. మూడు రోజుల్లోనే రూ.205 కోట్ల నెట్ సాధించింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా పుష్ప రికార్డు కొట్టింది. ఈ చిత్రం హిందీలో వరుసగా తొలి రోజు రూ.72 కోట్లు, రెండో రోజు రూ. 59కోట్లు, మూడో రోజు రూ.74 కోట్లు వసూల్ చేసింది.
ఓవర్సీస్ జోరు
ఓవర్సీస్లోనూ కాసుల వర్షం కురుస్తోంది. ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే 8 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. ఇక వీకెండ్ ఆదివారం కూడా మంచి వసూళ్లను సాధించింది. ఆదివారం రోజు లక్షా 25వేల డాలర్ల కలెక్షన్లు క్రాస్ చేసింది.
ఇఖ సినిమా విషయానికొస్తే, నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా హీరోయిన్గా నటించగా, డ్యాన్స్ క్వీన్ శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు, అనసూయ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి, నవీన్ సంయక్తంగా నిర్మించారు.
సినిమా డైరెక్ట్ చేసింది అతడే- పొరపాటున నా పేరు వేసుకున్నా!: సుకుమార్
వరల్డ్‌వైడ్‌గా పుష్పరాజ్ రూలింగ్- 'వైల్డ్ ఫైర్' రికార్డులివే