ETV Bharat / entertainment

అల్లు అర్జున్​ వద్దన్నారు - ఆ స్టార్ హీరో హిట్ కొట్టారు - ఏ సినిమా అంటే? - Allu Arjun Rejected Movie

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 12:50 PM IST

Allu Arjun Rejected Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఓ స్టోరీతో టాలీవుడ్​కు చెందిన మరో స్టార్ హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ? ఆ సినిమా ఏదంటే?

Allu Arjun Rejected Movie
Allu Arjun (ETV Bharat)

Allu Arjun Rejected Movie : సినీ ఇండస్ట్రీలో ఏ చిత్రం ఎటువంటి ఫలితాన్ని అందిస్తుందో ఎవ్వరూ ఊహించలేం. యావరేజ్ టాక్​తో నడుస్తుందని అనుకున్నది హిట్ అవ్వచ్చు, బ్లాక్ బస్టర్ అనుకున్న సినిమా నిరాశపరచచ్చు కూడా. ఈ డైలమాలో పలువురు స్టార్స్ తమ వద్దకు వచ్చిన స్క్రిప్ట్స్​ను అనూహ్య కారణాల వల్ల రిజెక్ట్ చేస్తుంటారు. అయితే అదే సినిమాలు అప్పుడప్పుడు హిట్​ అయ్యి మరో హీరోకు బ్రేక్ ఇస్తుంటాయి. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఓ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సెస్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ చిత్రం ఏదంటే?

అల్లు అర్జున్ డెబ్యూ మూవీ 'గంగోత్రి'లో ఆయన నటనకు టాలీవుడ్​లో మంచి ఆఫర్లు వచ్చాయి. అందులో సుకుమార్ డైరెక్ట్ చేసిన 'ఆర్య' ఒకటి. లవ్ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ చిత్రం విడుదలప్పుడే కాకుండా రీరిలీజ్​లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ ఆఫర్ వచ్చే సమయానికి అల్లు అర్జున్ చాలా కథలను విని రిజెక్ట్ చేశారట. సరైన స్టోరీ కోసం వెయిట్ చేశారట.

సరిగ్గా అదే టైమ్​కు డైరెక్టర్ బోయపాటి శ్రీను 'భద్ర' సినిమా స్టోరీని బన్నీకి వినిపించారట. అది విన్నాక అల్లు అర్జున్​కు చాలా బాగా నచ్చిందట. కానీ ఈ సినిమా చేద్దామా వద్దా అన్న డైలామాలో ఉండిపోయారట. అప్పుడే సుకుమార్ కూడా​ బన్నీ దగ్గరికి 'ఆర్య' స్క్రిప్ట్​తో వచ్చారట. అయితే రెండు కథలు నచ్చినప్పటికీ యూత్​ను ఆకట్టుకునే కథలా ఉందని 'ఆర్య'కు ఓకే చెప్పారట.

దీంతో 'భద్ర' స్క్రిప్ట్ మాస్ మహారాజ రవితేజ వద్దకు చేరింది. స్టోరీ విన్న రవితేజ వెంటనే ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. యాక్షన్ అంట్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్న 'భద్ర' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకుని దూసుకెళ్లింది. కలెక్షన్లలోనూ సత్తా చాటింది. రవితేజ కెరీర్​ను మలుపు తిప్పింది. ఇక 'ఆర్య' కూడా బన్నీ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్​ను అందించింది.

'ఆ హీరోయిన్ అంటే ఇష్టం' - మాస్ మహారాజా రవితేజ!

'పుష్ప' పాటలతో యూట్యూబ్​ షేక్- రిలీజ్​కు ముందే రికార్డులు బ్రేక్! - Pushpa 2 Records

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.