ETV Bharat / entertainment

'పుష్ప-3' కన్ఫార్మ్​! - బెర్లిన్ ఫెస్టివల్​లో ఐకాన్​ స్టార్ - అల్లు అర్జున్ పుష్ప 3

Allu Arjun Pushpa 3 : ఇటీవలే జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్​లో పాల్గొన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​. ఈ నేపథ్యంలో ఆయన పుష్ప సినిమా గురించి ఓ క్రేజీ అప్​డేట్​ ఇచ్చారు.

Allu Arjun Pushpa 3
Allu Arjun Pushpa 3
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 9:13 AM IST

Allu Arjun Pushpa 3 : లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కించిన మాసివ్ బ్లాక్​బస్టర్ మూవీ పుష్పకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఎన్నో అవార్డులను, ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్​లోనూ సందడి చేసింది. ఈ నేపథ్యంలో అక్కడికి అల్లు అర్జున్ వెళ్లారు. పుష్ప గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా పుష్ప సినిమా మూడో పార్ట్ కూడా ఉండనుందన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. ఇప్పటికే రెండో పార్ట్ చిత్రీకరణ శరవేగంగా జరగుతున్న నేపథ్యంలో ఈ వార్త మరింత ఊపందుకుంది. అయితే తాజాగా ఈ విషయంపై అల్లు అర్జున్​ స్పందించారు. 'పుష్ప 3 కూడా ఉండొచ్చు. మేము పుష్ప సినిమాను ఒక ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం' అంటూ ఫ్యాన్స్​కు తీయ్యటి కబురును అందించారు. దీంతో మూవీ లవర్స్ ఆనందం అంతా ఇంతా కాదు. త్వరలో దీని గురించి అఫీషియల్ అనౌన్స్​మెంట్ చేస్తే బాగున్ను అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

Pushpa 2 OTT Rights : వాస్తవానికి పుష్ప 2 విషయంలో డైరెక్టర్ సుకుమార్ అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉండటం వల్ల అందుకు తగట్టే ప్రతి సీన్ ఉండేలా చిత్రీకరణ చేస్తున్నారు. దీంతో మూవీ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇక పుష్ప ది రూల్ ఓటీటీ రైట్స్​ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీయే ఈ మధ్య తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పింది. థియేటర్లలో రిలీజైన తర్వాత సుమారు 45 నుంచి 60 రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.

Allu Arjun Upcoming Movies : 'పుష్ప2' షూటింగ్​ పూర్తయిన తర్వాత తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయనున్నారు అల్లు అర్జున్​. కొద్ది రోజుల క్రితమే బన్నీ బోయపాటితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​​తో కలిసి ఓ భారీ సోషియో ఫాంటసీ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్​ కూడా వచ్చేసింది. దీనికంటే ముందే 'యానిమల్​' డైరెక్టర్​ సందీప్ రెడ్డి వంగాతో ఓ యాక్షన్ మూవీ చేసేందుకు ఒప్పుకున్నారు ఐకాన్​ స్టార్​. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్ది నెలల క్రితమే వచ్చింది.

జర్మనీకి ఐకాన్​ స్టార్ - ఆ సినిమా కోసం స్పెషల్ ట్రిప్!

పుష్ప 3 లోడింగ్ - నీయవ్వ బన్నీ, సుక్కు తగ్గేదేలే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.