ETV Bharat / entertainment

1600 కి.మీ సైకిల్ జర్నీ- బన్నీని కలిసేందుకు ఫ్యాన్ క్రేజీ ఫీట్ - ALLU ARJUN FAN

Allu Arjun Fan Cycled 1600kms : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ను కలిసేందుకు ఆయన అభిమాని 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్ వచ్చారు.

Allu Arjun Fan Cycled 1600kms
Allu Arjun Fan Cycled 1600kms (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 4:26 PM IST

Allu Arjun Fan Cycled 1600 kms : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు 'పుష్ప' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. నార్త్​లో ఆయన డైలాగ్స్​, డ్యాన్స్​కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా పుష్ప మూవీలోని 'తగ్గేదేలే' డైలాగ్ మేనరిజానికి అక్కడి ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. అలా ఆయన నటన, డ్యాన్స్, డైలాగ్స్​కు అభిమాని అయిన ఓ వ్యక్తి, బన్నీని కలిసేందుకు ఏకంగా 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

ఉత్తర్​ప్రదేశ్ అలీగఢ్​కు చెందిన బన్నీ ఫ్యాన్ ఒకరు ఆయన్ను కలిసేందుకు సైకిల్​పై హైదరాబాద్ వచ్చారు. దాదాపు 1600 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన ఫ్యాన్​ను బన్నీ కలిశారు. బన్నీ టీమ్ ఆ అభిమానికి స్వాగతం పలికారు. అతడు సైకిల్​పై వచ్చాడని తెలుసుకున్న బన్నీ ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఇక అభిమానితో అల్లు అర్జున్ కాసేపు ముచ్చటించారు. 'పుష్ప - 2' సినిమా ప్రమోషన్స్​కు ఉత్తర్ ప్రదేశ్ వచ్చినప్పుడు అతడిని తప్పకుండా కలుస్తానని అన్నారు. దీంతో అతడు ఫుల్ హ్యాపీ ఫీలయ్యాడు.

సేఫ్​గా ఇంటికి తిరిగి వెళ్లాలని అతడికి బన్నీ సూచించారు. రిటర్న్​లో సైకిల్​పై కాకుండా ఫ్లైట్​లో వెళ్లేలా ఏర్పాటు చేయాలని తన టీమ్​ను బన్నీ ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్​కు తన ఫ్యాన్స్​ పట్ల ఎంతో ప్రేమ ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

వేరే లెవెల్​లో ఉంటుంది

పుష్ప తొలి పార్ట్​కు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం, బీజీఎమ్ అదిరిపోయాయి. తాజాగా సీక్వెల్​ గురించి కూడా ఆయన ఇంట్రెస్టింక్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందని చెప్పారు. ఫస్ట్​ హాప్​ అదిరిపోతుందంటూ ఫ్యాన్స్​లో మరింత ఆసక్తి రేకెత్తించారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ నెల 19న దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పుష్ప 2 గురించి మాట్లాడారు. కాగా, ఈ సినిమా 2024 డిసెంబర్ 5న గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

'పుష్ప 2'పై దేవీ శ్రీ ప్రసాద్​ అదిరిపోయే అప్డేట్​ - ఫ్యాన్స్​కు పండగే!

'70 ఏళ్లలో ఎప్పుడూ అలా జరగలేదు' - పుష్ప 2 అప్డేట్​ ఇచ్చిన నిర్మాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.