ETV Bharat / entertainment

ఐదు పదుల వయసులోనూ ఎనర్జిటిక్ - ఈ బీటౌన్ సింగర్ ఒక్క సాంగ్ రెమ్యూనరేషన్ ఎంతంటే ? - Alka Yagnik Net Worth - ALKA YAGNIK NET WORTH

Alka Yagnik Net Worth : బాలీవుడ్​లో ఎంతో మంది స్టార్​ సింగర్లకు ఇన్​స్పిరేషన్​గా నిలుస్తూ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్​ సింగర్స్​లో ఒకరిగా నిలిచారు సీనియర్ గాయని అల్కా యాగ్నిక్. ఐదు పదుల వయసులోనూ యువ సింగర్లతో పోటీగా పాడుతున్నారు ఆమె. అయితే ఆమె ఒక్కో సాంగ్​కు ఎంత పారితోషకం అందుకుంటున్నారంటే ?

Alka Yagnik Net Worth
Alka Yagnik Net Worth
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 4:58 PM IST

Alka Yagnik Net Worth : సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సింగర్స్ తమ ట్యాలెంట్​తో పలు హిట్ సాంగ్స్ అందించారు. అందులో బాలీవుడ్ మెలోడీ క్వీన్ అల్కా యాగ్నిక్ కూడా ఒకరు. ఇప్పటి వాళ్లకు ఈమె సుపరిచితురాలు కానప్పటికీ, 90స్ ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు. కిషోర్​ కుమార్, కుమార్ సానూ, సోనూ నిగమ్​, ఆషా భోస్లే లాంటి దిగ్గజాలతో కలిసి వర్క్ చేశారు. ఐదు పదుల వయసులోనూ చక్కటి గాత్రంతో ఇప్పటి యూత్​ను ఉర్రూతలూగించే పాటలు పాడుతున్నారు. ​1980లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఇప్పటి వరకు దాదాపు 8,000 పాటలను రికార్డ్ చేసి అత్యుత్తమ సింగర్లలో ఒకరిగా రాణిస్తున్నారు.

తన ముప్పై ఏళ్ల కెరీర్​లో ఇప్పటివరకు అల్కా ఉత్తమ నేపథ్య గాయనిగా ఏడుసార్లు ఫిల్మఫేర్ అవార్డును అందుకున్నారు. అంతే రెండు నేషనల్ అవార్డులు, పలు నేషనల్, ఇంటర్నేషన్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 2013లో ప్రతిష్టాత్మక లతా మంగేష్కర్ అవార్డు కూడా అందుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హిందీలోనే కాకుండా గుజరాతీ, మరాఠీ, భోజ్ పురి, బెంగాలీ, తెలుగు, నేపాలీ, ఒరియా, పంచాబీ, అస్సామీ లాంటి విభిన్న భాషల్నింటిలోనూ దాదాపు ఆమె పాటలు పాడారు. తన లిస్ట్​లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నప్పటికీ, 'ఏక్ దో తీన్', 'చోలీ కే పీచే', 'మేరీ మెహబూబా', 'తాల్ సే తాల్', 'దిల్ నే యే కహా హై దిల్ సే', 'ఓ రే చోరీ', 'హమ్ తుమ్', 'గూంగట్​ కి ఆద్ సే', 'కుచ్ కుచ్ హోతా హై', 'కహో నా ప్యార్ హై', 'సన్​ సనా', 'కబీ అల్విదా నా కెహనా', 'అగర్ తుమ్ సాత్​ హో' లాంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ ఫేవరట్ పాటలుగా ఉన్నాయి.

ఒక్కో పాటకు లక్షల్లో సంపాదన
ప్రస్తుతం అల్కా యాగ్నిక్ ఒక్క పాటకు రూ.12 లక్షల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. 'గద్దర్-2'లోని 'ఉడ్​ జా కాలే కవ్వా' అనే పాటను ఆమె చివరగా ఆలపించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా కొన్ని సింగింగ్ రియాలిటీ షోస్ ద్వారా కూడా ఆమె లక్షల్లో ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. వీటితో పాటు యాడ్స్, ఇంకొన్ని మాధ్యమాల ద్వారా ఆమె ఏడాదికి దాదాపు రూ.2 కోట్ల వరకూ సంపాదిస్తున్నట్లు సమాచారం. మార్కెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఈమె ఆస్తి విలువ దాదాపు రూ.68 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

పెర్ఫార్మెన్స్​లోనే కాదు- రెమ్యునరేషన్​లోనూ టాపే- ఒక్కో పాటకు అన్ని లక్షలా? - Shreya Ghoshal Remuneration

మ్యూజిక్​ నేర్చుకోకుండా రూ.200కోట్ల సంపాదన!- ఎవరబ్బా ఆ సింగర్​? - SINGER who has 200cr networth

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.