ETV Bharat / entertainment

'సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు - ఆ రెండూ నా బలమే' - Akshay Kumar Sarfira Movie - AKSHAY KUMAR SARFIRA MOVIE

Akshay Kumar Sarfira Movie : వరుస ప్రాజెక్టుల్లో నటిస్తున్నప్పటికీ నటుడు అక్షయ్‌కుమార్ ఖాతాలో ఓ సరైన హిట్ పడటం లేదు. తాజాగా వచ్చిన 'సర్ఫిరా' కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో అక్షయ్​ కూడా ఈ విషయంపై తాజాగా స్పందించారు.

Akshay Kumar Sarfira Movie
Akshay Kumar (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 11:10 AM IST

Akshay Kumar Sarfira Movie : బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ తాజాగా 'సర్ఫిరా' అనే సినిమాతో అభిమానులను పలకరించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేదు. అంతేకాకుండా ప్రస్తుతం స్లోగానే థియేటర్లలో నడుస్తోంది. అంతకముందు ఆయన నటించిన బడేమియా చోటేమియా కూడా తీవ్ర నిరాశపరిచింది. దీంతో వరుస ఫ్లాప్‌ల గురించి అక్షయ్​ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

"ప్రతీ సినిమాను ఎంతో ఇష్టంతోనే చేస్తాం. దానికోసం ప్రాణం పెడతాం. అటువంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందటం అనేది చూస్తుంటే మన హృదయం ముక్కలవుతుంది. ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, విజయాన్ని సాధించాలనే తపన దాని వల్ల మరింత పెరుగుతుంది. కెరీర్‌ ప్రారంభంలోనే నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను. సినిమా రిజల్ట్ కొన్ని సార్లు మనల్ని బాధించవచ్చు. అది మన కంట్రోల్‌లో లేనిది. కష్టపడి పని చేయటం మాత్రమే మన చేతిలో ఉంటుంది. అలా నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ మరో సినిమా కోసం పనిచేయడం మొదలుపెడుతుంటాను. డిసిప్లైన్​తో పాటు, పనిపై నిబద్దత ఉండటమే నా అసలు బలం. ఫుడ్‌, వర్కౌట్స్‌, వర్క్ ఇలా అన్నింటికోసం ఒక టైమ్‌టేబుల్‌ పెట్టుకొని ఫాలో అవుతుంటాను. శారీరకంగా, మానసికంగా నేను స్ట్రాంగ్​గా ఉండటానికి అదే కారణం. కొవిడ్‌ తర్వాత ఇండస్ట్రీ ఎంతో మారింది. ఆడియెన్స్​ కూడా డిఫరెంట్​ కంటెంట్​ ఉండే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్‌లు సెలక్ట్‌ చేసుకోవడం కూడా ఎంతో అవసరం" అంటూ అక్షయ్‌ పేర్కొన్నారు.

ఇక అక్షయ్‌ ఇప్పటి వరకు తన కెరీర్​లో దాదాపు 16 ఫ్లాప్‌లు అందుకున్నారు. రీసెంట్​గా ఆయన నటించిన 'సెల్ఫీ', 'మిషన్‌ రాణిగంజ్‌', వంటి సినిమాలు మిక్స్​డ్​ టాక్​తో సరిపెట్టుకున్నాయి. ఇక 'సర్ఫిరా' కూడా బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో హిట్​ టాక్ అందుకోలేకపోయింది. స్టోరీ బాగున్నప్పటికీ, కలెక్షన్స్‌ అంతగా రావట్లేదని ట్రేడ్ వర్గాల టాక్.

'కన్నప్ప' సినిమాలో బాలీవుడ్ హీరో - అక్షయ్ తెలుగు​ డెబ్యూ ఇదే! - Akshay Kumar Kannappa Movie

Indias Most Successful Actor : ప్రభాస్​, షారుక్​, రజనీ కాదు.. ఇండియాలో మోస్ట్ స‌క్సెస్​ఫుల్ యాక్ట‌ర్ ఆయనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.