ETV Bharat / entertainment

స్టార్ హీరో లైనప్​లో ఏకంగా 9 సినిమాలు - రూ.650 కోట్ల బడ్జెట్​తో! - Big Budget Upcoming Movies - BIG BUDGET UPCOMING MOVIES

హిట్ ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు లైన్​లో పెడుతూనే ఉన్నారు ఓ స్టార్ హీరో. ఇప్పుడు ఆయన చేతిలో ఏకంగా 9 ప్రాజెక్ట్​లు ఉన్నాయి. దాదాపు రూ.650 కోట్ల బడ్జెట్​తో ఇవి తెరకెక్కుతున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు? ఆ సినిమా వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

source Getty Images
BIG BUDGET UPCOMING MOVIES (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 3:01 PM IST

AKSHAY KUMAR UPCOMING MOVIES : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్​ హిట్ ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు లైన్​లో పెడుతూనే ఉంటారు. ఇతర స్టార్​ హీరోల కన్నా ఎక్కువ సినిమాలు ఆయన లైనప్​లో ఉంటాయి. రీసెంట్‌గా తన బర్త్ డే(సెప్టెంబర్ 9న) సందర్భంగా కూడా డైరక్టర్ ప్రియదర్శన్​తో కలిసి ఓ హారర్‌ కామెడీ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో 'భూత్ బంగ్లా' అనే సినిమా రాబోతున్నట్లు పేర్కొన్నారు. 2025 నాటికి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన హీరా ఫేరీ, భూల్ భూలయ్యా, గరం మసాలా, భాగం భాగ్, దే దనా దన్ లాంటి హిట్ సినిమాలు వచ్చాయి.

ఇకపోతే అక్షయ్​ కుమార్​కు చాలా కాలంగా సరైన హిట్ పడలేదు. ఆయన నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. దాదాపు వరుసగా 10 సినిమాల వరకు ఫ్లాప్ అయ్యాయి. అయినా ఆయన చేతిలో ఇప్పుడు మరో 9 ప్రాజెక్ట్​లు ఉన్నాయి. వాటి బడ్జెట్​ దాదాపు రూ.650 కోట్లు అని సమాచారం. ఇంతకీ అవేంటంటే?

1.సింగం అగైన్

రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో ఐదో సినిమా సింగం అగైన్. ఇది సింగం రిటర్స్ (2014)కు సీక్వెల్. అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, అశుతోష్ రానాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2021లో వచ్చని 'వీర్ సూర్యవంశీ' సినిమాలో తరహాలో మరోసారి అక్షయ్ కుమార్ డీసీపీ రోల్‌లో కనిపించనున్నారు.

2.కన్నప్ప

కెరీర్‌లోనే తొలిసారి డైరక్ట్ తెలుగు సినిమాలో నటించబోతున్నారు అక్షయ్ కుమార్. శివ భక్తుడైన 'కన్నప్ప' జీవితం ఆధారంగా మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేశ్ కుమార్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అక్షయ్ మహా శివుని పాత్ర పోషిస్తున్నారు. రూ.60కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2024లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

3.వేదత్ మరాఠె వీర్ దౌడ్లే సాత్

మహేశ్ మంజ్రేకర్ తీయబోయే మరాఠీ సినిమా ఇది. ఇందులో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ పాత్ర పోషిస్తున్నారు. 1674వ సంవత్సర కాలంలో మరాఠా సామ్రాజ్య స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏడుగురు మహా వీరుల నేపథ్యంతో ఈ సినిమా తీయనున్నారు. అక్షయ్ కుమార్‌తో పాటు ప్రవీణ్ తార్డె, హర్దీక్ జోషి, విశాల్ నికం, జయ్ దుధానెలు నటిస్తున్నారు.

4.శంకర

అక్షయ్ మరో బయోపిక్‌లో కూడా నటించబోతున్నారు. 1906 - 1908 మధ్య కాలంలో అడ్వకేట్ జనరల్ ఆఫ్ మద్రాస్‌గా సేవలందించిన సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ జీవితంపై తీయబోతున్న సినిమా ఇది. 'శంకర' అనే టైటిల్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ద కేస్ దట్ షూక్ ద ఎంపైర్ అనే పుస్తక ప్రేరణతో కథను సిద్ధం చేసుకున్నారు. ఇందులో ఆర్ మాధవన్, అనన్య పాండేలు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

5.హీరా ఫేరీ 3

హీరా ఫేరీ సిరీస్​లో మూడో సినిమా ఇది. సునీల్ శెట్టి, పరేశ్ రావల్​తో కలిసి మూడో సారి చేయబోతున్న ప్రాజెక్ట్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రియదర్శన్ డైరక్షన్ చేస్తుండగా ఫిరోజ్ నదియాద్వాలా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

6.స్కై ఫోర్స్

అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేలానీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా స్కై ఫోర్స్. యుద్ధ నేపథ్యమున్న కథలో అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్, సారా అలీ ఖాన్​లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి నిర్మాత దినేశ్ విజన్. 1965వ కాలంలో జరిగిన ఇండో-పాకిస్థాన్​ ఎయిర్ వార్​ను దృశ్య రూపంలో మన ముందుకు తీసుకురానున్నారు. 2023 అక్టోబరులోనే సినిమాను అనౌన్స్ చేసినప్పటికీ 2025 రిపబ్లిక్ డే నాటికి రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

7.జాలీ ఎల్ఎల్బీ

జాలీ ఎల్ఎల్బీ సిరీస్ కొనసాగింపుగా వస్తోన్న మూడో పార్ట్ ఈ జాలీ ఎల్ఎల్బీ 3. గత సినిమాల్లో చేసిన అక్షయ్ కుమార్, అర్షద్ వర్సీ, హుమా ఖురేషీ, అమృతా రావు, సౌరభ్ శుక్లాలనే ఇందులోనూ కంటిన్యూ చేయనున్నారు. జులై 2024కే సినిమా పూర్తి అయిపోగా 2025 ఏప్రిల్ 11న దీని రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు.

8.వెల్కమ్ టూ ద జంగిల్

వెల్కమ్ సినిమాలలో మూడో సారి రాబోతున్న సినిమా వెల్కమ్ టూ ద జంగిల్. అక్షయ్ కుమార్, రవీనా టాండన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పరేశ్ రావల్, శ్రేయాస్ తల్పడే, జానీ లివర్, రాజ్పల్ యాదవ్, అర్షద్ వార్సి, తుషార్ కపూర్, దిషా పటానీ, సునీల్ శెట్టిలు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక 9వ చిత్రం భూత్ బంగ్లా. ఇది 2025లో విడుదల కానుంది!

'నాకు చెప్పకుండానే విడాకుల ప్రకటన' - స్టార్​ హీరో భార్య సంచలన ఆరోపణ - Jayam Ravi Wife Aarti Ravi

'దేవర' బిజినెస్ డీటెయిల్స్ ఇవే​ - భారీ స్థాయిలో టికెట్ ప్రీ సేల్స్​! - NTR Devara Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.