ETV Bharat / entertainment

అక్షయ్ కోసం ముగ్గురు భామల పోటీ - ఎవరికి ఛాన్స్ దక్కనుందో ? - Keerthy Suresh Akshay Kumar Movie

Akshay Keerthy Suresh Movie : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నెక్స్​ట్​ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్లు రేసులో ఉన్నారట. మరి వారిలో ఎవరు ఎంపిక కానున్నారంటే?

Keerthy Suresh Bollywood Movie
Keerthy Suresh Bollywood Movie (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 8:47 PM IST

Akshay Keerthy Suresh Movie : బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కలిసి మరో ప్రాజెక్టను తెరకెక్కించనున్నారు. గతంలో వీళ్లద్దరూ కలిసి హేరా ఫేరీ, కట్టా మీటా వంటి సినిమాల్లో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు అప్పట్లో ఎంత హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో మరో చిత్రం రానుంది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండటం వల్ల ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. ఇప్పటికే ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉందట. అందులో కీర్తి సురేశ్​తో పాటు బీటౌన్ బ్యూటీస్ ఆలియా భట్​, కియారా అడ్వాణీ ఉండటం విశేషం.

అయితే ఈ హీరోయిన్ల విషయంలో పలు రూమర్స్ ట్రెండ్ అవుతున్నాయి. తొలుత ఈ సినిమా కోసం ఆలియా భట్​ను హీరో అలాగే డైరెక్టర్ ఓకే చేశారని తెలుస్తోంది. ఇది ఓ వెర్షన్ అయితే, అక్షయ్ కోసం కియారాను మేకర్స్ సెలెక్ట్ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, సౌత్ సెన్సెషనల్ హీరోయిన్ కీర్తీ సురేశ్​ ఈ సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నారనే పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే సినిమాకు సంతకం చేసిన కీర్తి, దాంతో పాటు ఈ సినిమా కోసం కూడా డేట్లు కేటాయించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కన్ఫార్మ్ అయితే కీర్తి వరుసగా బాలీవుడ్ లో రెండు సినిమాల్లో కనిపించనున్నట్లే.

అయితే ఈ ముగ్గురు హీరోయిన్లనూ చిత్ర యూనిట్ సంప్రదించిందనీ, ఇందులో స్క్రిప్ట్ ఎవరికి నచ్చుతుందో ఎవరి డేట్స్ ఖాలీగా ఉంటాయో తెలియాల్సి ఉందని సమాచారం. ఇందులో సినిమా యూనిట్ ఎవరిని ఫైనల్ చేస్తారో తెలియాలంటే ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ వేచి చూడాల్సిందే.

'కన్నప్ప' సినిమాలో బాలీవుడ్ హీరో - అక్షయ్ తెలుగు​ డెబ్యూ ఇదే! - Akshay Kumar Kannappa Movie

కీర్తి సురేశ్ తొలి బాలీవుడ్ సినిమా ఇదే - ఏకంగా ఎన్ని కోట్లు ఛార్జ్​ చేసిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.