ETV Bharat / entertainment

'అఖండ 2' బిగ్ లీక్​​ - నందమూరి ఫ్యాన్స్​కు పూనకాలు లోడింగ్​! - అఖండ 2

Akhanda 2 : 'అఖండ 2' గురించి ప్రస్తుతం చిత్రసీమలో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. అది కనుక జరిగితే ఇక నందమూరి ఫ్యాన్స్​కు పూనకాలే! దాని గురించే ఈ కథనం.

'అఖండ 2' అప్డేట్​ - బాలయ్య నెక్ట్స్​ సినిమా ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 6:48 AM IST

Akhanda 2 : కరోనా చివరి దశ సమయంలో సినిమా రిలీజ్ చేస్తే అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే ఆలోచనలో పడిపోయిన మేకర్స్​కు, చిత్రసీమకు ఊపిరిపోసిన సినిమా 'అఖండ'. 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్​తో సౌండ్ మోగించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అప్పుడే ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు.

అయితే కొద్ది రోజుల క్రితం దర్శకుడు బోయపాటి శ్రీను గీతా ఆర్ట్స్‌ బ్యానర్​పై ఓ సినిమా చేయనున్నట్లు ఆ సంస్థ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. కానీ హీరో ఎవరనే డీటేయిల్స్​ను మాత్రం చెప్పలేదు. మరోవైపు బోయపాటి అప్పటికే అల్లు అర్జున్‌, సూర్య(కోలివుడ్​) కోసం కథలను కూడా సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం సాగింది. ఇప్పుడా కథానాయకులు ఇద్దరు ప్రస్తుతం టాలీవుడ్​లో ఇతర చిత్రాల షూటింగ్​లతో ఫుల్​ బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ - బోయపాటి శ్రీను(Balakrishna Boyapati Akhanda 2) కాంబో సినిమా గురించి తెరపై వార్తలు రావడం మొదలయ్యాయి. దీంతో అఖండ 2పై ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ కాంబోలో 'అఖండ 2'నే పట్టాలెక్కుతుందా లేక, వేరే కథతో సినిమా చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అఖండ 2 కోసం అయితే ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం అందించింది. సమీకరణలన్నీ కుదిరితే ఆ సినిమానే పట్టాలెక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

ఇకపోతే బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది షూటింగ్​ దశలో ఉంది. దీని తర్వాత బాలయ్య ఇప్పటికైతే ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. కాబట్టి బోయపాటితో కలిసి అఖండ 2 కోసం పని చేసే అవకాశముందని కూడా టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంతో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'లాలా సలామ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది- ఆ ఒక్కటే మిస్సైంది!

నాగార్జున మూవీ కోసం అలియా భట్ తండ్రి హైడ్రామా - హీరోయిన్​ను చంపేసి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.