ETV Bharat / entertainment

34 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్​ను కలిసిన ఆ ముగ్గురు! - Megastar Chiranjeevi Viswambara - MEGASTAR CHIRANJEEVI VISWAMBARA

Bimbisara Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని ఆ ముగ్గురు 34 ఏళ్ల తర్వాత కలిశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
Chiranjeevi (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 10:40 AM IST

Bimbisara Chiranjeevi Ajith Kumar Wife : కొన్నిసార్లు పాత ఫొటోలు చూసినప్పుడు అప్పటి పాత మధుర జ్ఞాపకాలు మదిలో మెదులుతుంటాయి. కాలం ఎంత వేగంగా కదిలిపోయింది కదా, అప్పుడే అన్నేళ్లు గడిచిపోయాయా అని అనిపిస్తూనే మళ్లీ తిరిగి ఆ రోజులు వస్తే బాగుంటది అనుకుంటాం. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి ఓ పాత ఫొటోనే తెగ వైరల్ అవుతోంది.

అదేంటంటే? - ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిని విశ్వంభర సెట్స్​లో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌ కలిసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటో సోషల్ మీడియాలో అప్పుడు బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా అజిత్ భార్య షాలిని కూడా ఓ పాత ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్​లో షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పిక్​ను పోస్ట్​ చేశారు. ఇందులో తన సోదరి షామ్లీ, సోదరుడు రిచర్డ్ రిషి కూడా ఉన్నారు. అది అభిమానులను ఆకకట్టుకుంటోంది.

అలానే ఇక్కడ అభిమానులను ఆశ్చర్యపరిచే మరో విషయమేమిటంటే ఈ చిత్రంలో ఉన్న ముగ్గురూ చిరంజీవి బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)లో నటించినవారే. అంటే దాదాపు 34 ఏళ్ల తర్వాత ఈ ముగ్గురు మరోసారి మెగాస్టార్‌ను కలిశారన్నామాట. షాలినితో పాటు షామిలి, రిషి కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి షూటింగ్ సమయంలో దిగిన ఫొటోను, ఇప్పుడు తీసుకున్న ఫొటోను కొలైజ్ చేసి పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

కాగా, షాలిని, షామిలి పెద్దయ్యాక హీరోయిన్లుగా పలు చిత్రాల్లో నటించగా రిషి కూడా తెలుగు, తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ఇక చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభరలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకుడు. ఆషికా రంగనాథ్, సురభి, ఈషా చావ్లా, రమ్య పసుపులేటి కూడా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సోషియో ఫాంటసీ రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మహేశ్, రాజమౌళి సినిమా ఎక్కడి దాకా వచ్చిందంటే? - SSMB 29 Movie

రామ్​చరణ్​, అలియా భట్ కాదు- ఇండియాలో రిచెస్ట్​ స్టార్ కిడ్​ ఈ హీరోనే! - Richest star kid In India

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.