ETV Bharat / entertainment

2025లో శేష్​ మేనియా - ఆ మూడు సినిమాలే టార్గెట్! - Adivi Sesh Upcoming Movies - ADIVI SESH UPCOMING MOVIES

Adivi Sesh Upcoming Movies : స్టార్ హీరో అడివిశేష్​ తాజాగా తన లైనప్​ గురించి ఓ సూపర్ అప్​డేట్ ఇచ్చి అభిమానులను సర్​ప్రైజ్ చేశారు. ఆ వివరాలు మీ కోసం.

Adivi Sesh Upcoming Movies
Adivi Sesh (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2024, 7:03 AM IST

Adivi Sesh Upcoming Movies : థ్రిల్లింగ్ కంటెంట్​తో ఆడియెన్స్​ను అలరిస్తూ ఇండస్ట్రీలో హిట్లతో దూసుకెళ్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్​. ఈయన ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకున్నవే. ఇటీవల​ 'హిట్​ 2'తో పలకరించిన శేష్, ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకులను సర్​ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా తన అభిమానులకు ఓ సూపర్ అప్​డేట్​ ఇచ్చి సర్​ప్రైజ్ చేశారు.

2025 సంవత్సరంలో తనవి మూడు సినిమాలు విడుదల కానున్నట్లు తాజాగా శేష్​ రివీల్ చేశారు. అయితే ఇప్పటికే ఈయన లైనప్​లో 'గూఢచారి 2' తో పాటు డకాయిట్ సినిమాలు ఉండగా, ఈ మూడో ప్రాజెక్ట్​ ఏమైయ్యుంటదా అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. ఇక మరికొందరేమో ఆయన 'హిట్​ 3'లోనూ నటించనున్నారని బహుశా అదే తన మూడో సినిమా అయ్యుండచ్చని చర్చించుకుంటున్నారు.

2018లో విడుదలైన 'గూఢచారి' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకోవడమే కాకుండా శేష్​కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఈ స్టార్ హీరో కూడా ఇటువంటి జానర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. దీంతో 'గూఢచారి-2' మూవీ లవర్స్​లో అంచనాలు పెంచేసింది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ వీడియో, స్పెషల్ పోస్టర్స్​లో శేష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

ఇక జీ2లో శేష్ సరసన బాలీవుడ్ స్టార్ బనిత సంధు నటిస్తోంది. సీనియర్ నటుడు ఇమ్రాన్ హష్మి కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫాక్టరీ బ్యానర్​పై విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. మొదటి భాగాన్ని కొనసాగించే కథతోనే ఈ చిత్రం వస్తుందంటూ మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే మొదటి భాగంలో స్పైగా శిక్షణ తీసుకున్న శేష్ రెండో భాగంలో విదేశాల్లో దేశం కోసం పోరాడతాడని సమాచారం. ఇంకా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించకలేదు.

శత్రువులుగా మారిన ప్రేమికులు- అడివి శేష్ 'డెకాయిట్' టీజర్​ రిలీజ్

Tollywood Spy movies : తెలుగులో 'స్పై' సినిమాలు.. వాటికి అతడే కరెక్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.