Adivi Sesh Real Name : సినీ ఇండస్ట్రీలో చాలా మందికి రెండు పేర్లు ఉంటాయి. ఒకటి పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టింది అయితే, మరొకటి సినిమాల్లోకి వచ్చాక వివిధ అవసరాల కోసం పెట్టుకుంది. ఇలా రెండు పేర్లున్న లిస్టులో ఓ యంగ్ యాక్టర్ కూడా ఉన్నారు. ఆయనే అడివి శేష్. ఈ పేరు వినగానే చాలా మందికి, డిఫరెంట్‌గా ఉంది కదా అని అనిపిస్తుంది. వాస్తవానికి ఆయన అసలు పేరు అది కాదట. అయితే ఆయన తన పేరును సినిమా అవసరాల కోసం కూడా మార్చుకోలేదు. దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటంటే ?
శేష్ పేరు ఎందుకు మారింది?
ఒక ఇంటర్వ్యూలో, తన పేరు మార్చడానికి గల కారణాన్ని అడివి శేష్ వెల్లడించారు. "నిజానికి నా అసలు పేరులో శేష్ కూడా లేడు. నేను యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నప్పుడు, నా పేరు చూసి ప్రజలు నన్ను ఆటపట్టించేవారు. సన్నీ డిలైట్ అనే ఆరెంజ్ ఫ్లేవర్డ్ డ్రింక్ ఉంది. అలాగే, సన్నీ లియోన్ పాపులర్ అయిన సమయం అది. నా పేరులో సన్నీ ఉన్నందున చిన్నపిల్లలు నన్ను ఆటపట్టించేవారు. నా పేరు చూసి ప్రజలు నన్ను ఆటపట్టిస్తున్నారని నేను మా నాన్నతో చెప్పాను. నా పేరులో శేష్ కూడా భాగమని, నేను దాన్ని ఉపయోగించుకోవచ్చని నాన్న చెప్పారు. నాన్న ఆ విషయం చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మా నాన్న సునీల్ గవాస్కర్‌కి వీరాభిమాని కాబట్టి నాకు సన్నీ అని పేరు పెట్టారు. తర్వాత నేను నా పేరు శేష్ అనే చెప్పేవాడిని. భారతదేశానికి వచ్చిన తర్వాత, శేష్ ఒక సాధారణ పేరు అని తెలిసింది." అని శేష్ అసలు విషయాన్ని రివీల్ చేశారు.
'క్షణం'తో కెరీర్ మలుపు
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టోరీలు కూడా రాయగల యాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. కెరీర్ ప్రారంభమైన చాలా కాలం తర్వాత ఆయనకు మంచి హిట్ లభించింది. 'క్షణం' మూవీ సక్సెస్‌తో అడివి శేష్ కెరీర్ మలుపు తిరిగింది. తర్వాత తన కెరీర్లో తాను వెనుతిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లు, విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 'గూఢచారి' సీక్వెల్‌గా రానున్న 'జీ2' షూటింగ్‌లో శేష్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.
'డైరెక్టర్‌ను అందుకే మార్చాం - ఇది శేష్ నిర్ణయం కూడా' - Adivi Sesh G2 Movie Director
అడివి శేష్ రిలేషన్షిప్ - సీక్రెట్ రివీల్ చేసేసిన డైరెక్టర్! - Adivi Sesh Relationship