ETV Bharat / entertainment

'మా అమ్మ వల్లే దాని గురించి చెప్పాల్సి వచ్చింది' - అసలు నిజం చెప్పిన అదితి - Aditi Rao Hydari Engagement - ADITI RAO HYDARI ENGAGEMENT

Aditi Rao Siddharth Engagement : స్టార్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ తాజాగా తన ఎంగేజ్​మెంట్ విషయంపై స్పందించింది. ఈ విషయాన్ని మీడియా వాళ్లకు చెప్పడానికి గల కారణాన్ని వివరించింది.

Aditi Rao Siddharth Engagement
Aditi Rao Siddharth Engagement
author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 3:37 PM IST

Aditi Rao Siddharth Engagement : బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ అదితిరావు హైదరీ -సిద్ధార్థ్​ల ఎంగేజ్​మెంట్​ గత నెలలో సీక్రెట్​గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై తాజాగా అదితి స్పందించింది. ఈ విషయాన్ని మీడియా వాళ్లకు చెప్పడానికి గల కారణాన్ని వివరించింది. తన తల్లి కోరికమేరకే తమ నిశ్చితార్థం ఫోటోను పోస్ట్‌ పెట్టానని అన్నారు.

"జీవితంలో జరిగే పలు ఇంపార్టెంట్ మూమెంట్స్​ను ప్రత్యేకమైన ప్రదేశంలో చేసుకోవాలని అందరూ అనుకుంటారు. అందుకే నేను నా ఎంగేజ్​మెంట్​ను 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఆ గుడితో మా కుటుంబానికి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. మా అమ్మ కారణంగానే నేను ఆ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాను. మా పెళ్లి గురించి తెలుసుకోవాలని ఎంతోమంది మా అమ్మకు ఫోన్లు చేశారట. వాటికి ఆమె సమాధానం చెప్పలేకపోయింది. దీంతో 'ప్లీజ్​ నీ ఎంగేజ్‌మెంట్ విషయం మీడియాకు చెప్పు" అని కోరారు. దీంతో నేను, సిద్ధార్థ్‌ ఈ విషయంపై పోస్ట్‌లు పెట్టాం" అని అదితి రావు తెలిపింది.

ఇక మార్చి 27న వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో ఈ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో పాటు అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

ఇదిలా ఉండగా, అదితి ప్రస్తుతం 'హీరామండీ: ది డైమండ్‌ బజార్‌' అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ లీలా బన్సాలీ డైరెక్షన్​లో వచ్చిన ఆ ఈ సిరీస్​లో అదితి బిబ్బోజాన్‌ అనే పాత్రలో ఆకట్టుకున్నారు. వేశ్య వృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న కొంతమంది మహిళల జీవిత కథే ఈ స్టోరీ. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌లో అదితీతో పాటు మనీశా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్‌లు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్​సిరీస్​ స్ట్రీమ్ అవుతోంది.

ఇట్స్ అఫీషియల్​!- ఆమె ఎస్​ చెప్పిందంటున్న సిద్ధార్థ్​ - Siddharth Aditi Rao Engagement

సీక్రెట్​గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు హైదరి - సిద్ధార్థ్​ - Aditi Rao Hydari

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.