ETV Bharat / entertainment

అందాల తారల సమ్మర్ వెకేషన్ ఇలా - ఫుల్ చిల్​ - Actresses Summer Vacation - ACTRESSES SUMMER VACATION

Actresses Summer Vacation : ఈ వేసవిలో కొత్తగా పెళ్లైన సెలబ్రిటీ కపుల్స్​ చల్లని ప్రదేశాలైన తీర ప్రాంతాలకు చెక్కేసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ ప్రాంతాన్ని అక్కడ దొరికే రుచుల్ని తనివి తీరా ఆస్వాదించామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారెవరు, ఏం చేశారో చూసేద్దాం.

Source ETV Bharat and ANI
Kiara Rakul janhvikapoor (Source ETV Bharat and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 7:13 PM IST

Actresses Summer Vacation : సమ్మర్ అంటే గుర్తొచ్చేది బీచ్‌లే. ముఖ్యంగా సెలబ్రిటీలు తీర ప్రాంతాలకు చెక్కేసి ఫుల్ చిల్ అవుతుంటారు. అలా ఈ వేసవిలో బీచ్​లకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీ కపుల్స్​ లేదా సింగిల్స్​ సోషల్​ మీడియాలో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు.

రకుల్ ప్రీత్ - అటు సినిమాలు చేసుకుంటూనే గ్యాప్ దొరికినప్పుడల్లా ట్రిప్‌లు వేసేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఫిజీకి చెక్కేసింది. అక్కడ భర్తతో కలిసి బీచ్‌లలో ఈత కొడుతూ, సూర్యోదయాలను, సూర్యాస్తమయాలను ఎంజాయ్ చేశానంటూ ఫిజీ డైరీస్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

"ఫిజీ నేచర్, కల్చర్ నన్ను మైమరిపించాయి. మరో లోకంలోకి తీసుకెళ్లాయి. బీచ్‌లంటే మామూలుగానే ఇష్టపడే నేను ఫిజీ తీర ప్రాంతాలను ఆస్వాదించా. ఆర్మీ కుటుంబానికి చెందడంతో చిన్నప్పటి నుంచి ఏ ప్రాంతాన్నైనా త్వరగానే అడ్జస్ట్ అయిపోతుంటా. అలాగే వెకేషన్​కు వెళ్లినప్పుడు కూడా ఫిట్‌నెస్ మిస్ కాకుండా స్నార్ కెల్లింగ్, డైవింగ్, కయాకింగ్ వంటి అడ్వంచరస్ స్పోర్ట్స్​లో పాల్గొంటూ ఉంటున్నానని తన మెమొరీస్ షేర్ చేసింది.

కియారా అద్వానీ - సెలబ్రెటీ కపుల్ సిద్దార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీలు కలిసి ఖాళీ దొరికినప్పుడల్లా బీచ్‌లకు చెక్కేస్తుంటారు. పెళ్లికి ముందు కూడా ఇలాగే బీచ్‌లకు వెళ్లి విడివిడిగా ఫొటోలు షేర్ చేస్తూ మీడియాకు దొరికిపోయిన ఈ కపుల్ ఇంకా అదే ఎంజాయ్మెంట్‌లో ఉన్నారు. రీసెంట్​గా మరో బీచ్‌కు వెళ్లి అక్కడి తమ మెమొరీస్‌ను ఫొటోల రూపంలో సోషల్ మీడియాతో పంచుకుంది. వాటికి 'బీచ్ ప్లీజ్ ఇది యాడ్ కాదు!' అంటూ కామెంట్ కూడా పెట్టింది.

"ప్రొఫెషనల్ టైం మధ్యలో మనం ఎంచుకునే వెకేషన్లు ఎంతో సరదాను, మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. నాకు జర్నీలంటే చాలా ఇష్టం. అందులోనే బీచ్ లంటే ఇంకా ఇష్టం. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, టోక్యో వంటి దేశాల్ని నా ట్రావెల్ లిస్టులో చేర్చుకున్నా. ఎక్కడకు వెళ్లినా అక్కడి వంటకాల్ని టేస్ట్ చేసి, షాపింగ్ చేస్తుంటా. గ్రీనరీతో పాటు జలపాతాల మధ్యకు వెళితే మాత్రం యోగా కచ్చితంగా చేయాల్సిందే" అని షేర్ చేసుకుందీ కియారా.

జాన్వీ కపూర్ - సాధారణంగా పుణ్యక్షేత్రాల సందర్శనలో ఎక్కువగా కనిపించే జాన్వీ కపూర్ ఇటీవల ముప్పుత్తమ్మన్ ఆలయాన్ని సందర్శించి అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. పైగా ఇది వాళ్లమ్మ శ్రీదేవికి బాగా ఇష్టమైన ప్రదేశం అని రాసుకొచ్చింది.

"నాకు ఆధ్మాత్మికత అమ్మ నుంచే అలవడింది. ప్రతి బర్త్ డేకు తను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది. అమ్మ చనిపోయాక నేనే అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్లినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెకేషన్ గురించి చెప్పాలంటే సముద్రం పక్కన కూర్చొని సీ ఫుడ్ తినడం ఇష్టం. చిన్నప్పుడు ఒకసారి అమ్మానాన్నలు, ఖుషీతో పాటు నన్ను ఇటలీకి తీసుకెళ్లారు. అక్కడ బోట్​ను అద్దెకు తీసుకుని, సముద్రాల్లో ఈత కొట్టడం, రోడ్ ట్రిప్ అవన్నీ నాకు స్వీట్ మెమొరీస్‌గా గుర్తుండిపోయాయి" అంటోంది జాన్వీ.

దీపికా పదుకొణె, సమంత అరుదైన ఘనత - దశాబ్దకాలంలో వీరే టాప్​!

'విశ్వంభర' సెట్స్​లో మరో స్టార్ హీరో - పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చిరు - Viswambhara Chiranjeevi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.