ETV Bharat / entertainment

సమంత ఇంట్లో విషాదం- ఆమె తండ్రి మృతి

నటి సమంత ఇంట్లో తీవ్ర నిషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం మరణించారు.

Samantha Father Passed Away
Samantha Father Passed Away (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Samantha Father Passed Away : నటి సమంత ఇంట్లో తీవ్ర నిషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం మరణించారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు నటి సమంత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 'నాన్నా మళ్లీ మనం కలిసేంత వరకూ' అంటూ హార్ట్ బ్రేక్ అయ్యిన ఎమోజీని షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు సమంత కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.

జోసెఫ్ ప్రభు ఆంగ్లో ఇండియన్. ఆమె జీవితంలో తన తండ్రిది ముఖ్య పాత్ర అని సమంత ఇదివరకు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆమె కెరీర్​లో తన తండ్రి జోసెఫ్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారని సమంత గతంలో పేర్కొన్నారు. సినీ కెరీర్​లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమంత తన తల్లిదండ్రులను తరచూ కలిసేవారు. వాళ్లతో గడిపిన సందర్భాలను సోషల్ మీడియాలోనూ షేర్ చేసేవారు.

'చిన్నతనంలో నేను గుర్తింపు కోసం ఎక్కువగా పోరాటం చేస్తుండేదాన్ని. నాకు ఏమీ తెలియని అమాయకురాలినని నా తండ్రి భావించేవారు. నన్ను ఒక చిన్నపిల్లలా చూసేవారు. మా నాన్న ఒక్కరే కాదు. భారత్​లో ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లలను అలాగే చూస్తారు. ఆయన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి. తొలి సినిమా అవకాశం వచ్చినప్పుడు నేను చేయలేననుకున్నా. సినిమా రీలీజ్ అయ్యాక వచ్చిన ప్రశంసలను కూడా అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. కాన్ఫిడెన్స్​ పెంచుకున్నాను. నటిగా రాణించిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను చూసి ఎంతో గర్వపడ్డారు. నా పని విషయంలో వాళ్లు సంతృప్తి చెందారు' అని సమంత తన తండ్రి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కాగా, 2010లో 'ఏమాయ చేసావే' సినిమాతో సమంత తెరంగేట్రం చేశారు. ఈ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించి, బడా హీరోల సరసన నటించారు. తెలుగుతోపాటు తమిళంలోనూ అగ్ర కథానాయికగా రాణించారు. ఆ తర్వాత బాలీవుడ్​లోనూ అడుగుపెట్టి పలు సినిమాలు, వెబ్​సిరీస్​లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

'వాళ్లు సెకండ్‌ హ్యాండ్‌ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత

'మిమ్మల్ని పురుషులు అవమానిస్తే అలా చేయండి' - ఆడవారికి సమంత సూక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.