ETV Bharat / entertainment

లవర్​ను గ్రాండ్​గా పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ హీరోయిన్​ - Actress Meera Chopra Marriage

Actress Meera Chopra Married : హీరోయిన్ మీరా చోప్రా తన ప్రియుడిని గ్రాండ్​గా పెళ్లి చేసుకుంది. పెళ్లి ఫొటోస్​ను కూడా పోస్ట్ చేసింది.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 8:54 PM IST

Updated : Mar 13, 2024, 9:15 AM IST

Actress Meera Chopra Married : హీరోయిన్ మీరా చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టేసింది. గత కొద్ది రోజులుగా ఆమె పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన ప్రియుడు రక్షిత్‌తో కలిసి ఏడడుగులు వేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోలను పోస్ట్ చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రాజస్థాన్‌లోని జైపుర్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న మీరా అభిమానులు నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా, మీరా స్టార్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్‌ అన్న సంగతి తెలిసిందే. 1920 లండన్ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్, సెక్షన్ 375 చిత్రాల్లో నటించి కనిపించింది. తెలుగులో పవన్‌ కల్యాణ్​తో కలిసి బంగారం చిత్రంలో నటించింది. ఆ తర్వాత వాన, గ్రీకువీరుడు వంటి సినిమాలతోనూ అలరించింది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కోలీవుజ్​లో ఎక్కువగా నటించి మెప్పించింది. చివరిగా 2019లో సెక్షన్‌ 375 చిత్రంలో నటించింది. అనంతరం దాదాపు నాలుగేళ్ల తర్వాత సఫేద్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

హనీమూన్ రోజే స్టార్ హీరోయిన్​ను వేలం వేసిన భర్త - చిత్రహింసలు పెడుతూ నరకం!

అందుకే గుండు కొట్టించుకున్నా - వెక్కి వెక్కి ఏడ్చిన నటి సురేఖ

Last Updated : Mar 13, 2024, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.