ETV Bharat / entertainment

సెకండ్ ఇన్నింగ్స్ లో జ్యోతిక జోరు!- ఆమె అందానికి రహస్యమిదే? - ACTRESS JYOTIKA SECOND INNINGS - ACTRESS JYOTIKA SECOND INNINGS

Actress Jyotika Second Innings: సీనియర్ నటి జ్యోతిక ఒకప్పుడు స్టార్ హీరోయిన్​గా కెరీర్​లో దూసుకుపోయింది. ఇఫ్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ జోరును పెంచుతోంది. అన్ని రకాల భాషల్లోనూ నటించి అలరించిన ఈ అమ్మడు మహిళా ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. జ్యోతిక కెరీర్ షురూ చేసిన ఏళ్లు గడుస్తున్నా ఆమె అందం మాత్రం ఏమాత్రం చెరగలేదనే చెప్పాలి.మరి జ్యోతిక ఫిట్​నెస్, బ్యూటీ సీక్రెట్స్ ఏంటో మీకు తెలుసా?

Actress Jyothika Second Innings
Actress Jyothika Second Innings
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 12:06 PM IST

Actress Jyotika Second Innings: జ్యోతిక ఒకప్పటి దక్షిణాది అగ్ర తార. జ్యోతికను తన భర్త, నటుడు సూర్య ప్రేమగా జో అని పిలుచుకుంటారు. జ్యోతిక నటన గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 'చంద్రముఖి', 'షాక్', 'ఠాగూర్' సినిమాలు జ్యోతికలోని నటనకు అద్దం పట్టాయి. వర్థమాన హీరోయిన్లు జ్యోతికలా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. సూర్యతో వివాహం తర్వాత జ్యోతిక యాక్టింగ్​కు దూరంగా ఉంది. అప్పుడప్పుడు కొన్ని యాడ్స్​లో హీరో సూర్యతో కలిసి నటించింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే చాలా కాలం తర్వాత జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్​లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ, ఆకట్టుకునే అందంతో ఏమాత్రం తగ్గేది లేదంటోందీ భామ. ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సైతాన్ సినిమాతో బాలీవుడ్​లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్​గా వికాస్ భల్ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 8న రిలీజ్ అయిన ఈ మూవీ మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

కాగా, జ్యోతిక ఇటీవల వర్కౌట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్లైనా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. చక్కగా నాజుగ్గా ఉండటానికి కారణం ఏంటి? జ్యోతిక ఫిట్​నెస్ సీక్రెట్ ఏంటీ? అంటూ కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. మరి ఆ రహస్యమేంటో మనమూ తెలుసుకుందామా?.

రన్నింగ్​కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే జ్యోతిక ఫిట్​నెస్ సీక్రెట్ అంట. నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే జ్యోతిక రన్నింగ్ వెళ్లే ముందు స్వచ్చమైన గాలి, వెలుతురు ఉండే ప్రాంతాలను ఇష్టపడుతుందట. జిమ్​కు వెళ్లి వెయిట్ లిఫ్టింగ్, రోప్ ట్రైనింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని ఫిట్​గా ఉంచుకుంటుందట. ఇక మానసిక ప్రశాంతత కోసం స్పా లేదంటే స్విమ్మింగ్ కూడా చేస్తుందట. ఇక చర్మాన్ని మెరిసేలా తాజాగా ఉంచేందుకు రోజూ కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ వంటివి తాగుతుందట. ఇక ఆహారం విషయానికొస్తే, బయట ఫుడ్ జోలికి అస్సలు పోదట. తక్కువ కేలరీలు ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటానని చెబుతోంది. పండ్లు, కూరగాయలతోపాటు సలాడ్స్ తప్పకుండా తన డైట్లో చేర్చుకుంటుందట. ఈ అలవాట్ల వల్లే తను ఆరోగ్యంగా, అందంగానూ ఉండగలుగుతున్నట్లు జ్యోతిక చెబుతోంది .

అదేంటో!- టబు రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ బ్లాక్​బస్టర్​ హిట్లే! - Heroine Tabu Rejected Films

'అవి నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి - ఇలాంటివి నేను ఊహించలేదు ' - కృతిశెట్టి - KRITHI SHETTY ON NEGATIVE COMMENTS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.