ETV Bharat / entertainment

సినిమాలపై క్రేజ్- గవర్నమెంట్ జాబ్స్ వదులుకున్న స్టార్స్ వీరే!

Actors Who Left Government Jobs For Movies : సినిమాల్లోకి రావాలని ఆశయంతో కొంతమంది స్టార్స్​ గవర్నమెంట్​ జాబ్స్​ను వదులుకున్నారు.

Actors Who Left Government Jobs For Movies

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 5:41 PM IST

Actors Who Left Government Jobs For Movies: ఒకప్పటి నుంచి ఇప్పటి కాలం వరకు ఎంతో మంది తమ కలలను నెరవేర్చుకునేందుకు ఒక ఫీల్డ్​ నుంచి ఇంకో ఫీల్డ్​ వైపుకు అడుగులేస్తుంటారు. అందులో డాక్టర్​, ఇంజనీర్​, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వారూ ఉంటారు. అయితే ఎంతో శ్రమించి సాధించిన అదే ఉద్యోగాన్ని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవల్సిందే అన్నట్లు సినిమా రంగంపై ఆసక్తి ఉన్న కొంతమంది హీరోలు తాము చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకుని ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక్కడా మంచి గుర్తింపు తెచ్చుకుని పెద్ద స్టార్లుగా ఎదిగారు. ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

1. రజనీకాంత్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కప్పుడు బెంగుళూరు ట్రాన్స్ పోర్టు సర్వీసులో బస్ కండక్టర్​గా పనిచేశారు. సినిమాల్లోకి రావాలన్న కోరికతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమనే శాసించే స్థాయికి ఎదిగారు. దేశ వ్యాప్తంగా రజనీకాంత్​కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రజనినీ ముద్దుగా అందరూ తలైవా అని పిలుస్తారు.

2. దిలీప్ కుమార్: తన నటనతో బాలీవుడ్​ను శాసించిన స్టార్ హీరోల్లో దివంగత నటుడు దిలీప్ కుమార్ ఒకరు. సినిమాల్లోకి రాకముందు పుణెలో ఓ మిలటరీ క్యాంటీన్​ను నడిపేవారు. బాలీవుడ్ నటి దేవికా రాణి అతన్ని గుర్తించి ఆయనకు నటించేందుకు అవకాశమిచ్చారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

3. రాజ్ కుమార్: 'మదర్ ఇండియా', 'తిరంగా' లాంటి సినిమాలతో బీటౌన్​ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ హీరో రాజ్ కుమార్ ముంబయిలో సబ్​ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహించేవారు. బాలీవుడ్ లో కెరీర్ ను కొనసాగించుకునేందుకు ఆ ఉద్యోగాన్ని వదిలేశారు.

4. శివాజీ సతమ్: శివాజీ సతమ్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. సీఐడీ సీరియల్​లో ఏసీపీ ప్రధ్యుమ్న అంటే ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన విలక్షణ నటనతో బుల్లితెరపై రాణించిన ఈ స్టార్​ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్​గా పనిచేసేవారు. నటనపై ఉన్న ఆసక్తితో థియేటర్​ ఆర్టిస్ట్​గా మారారు. ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్​లో మెరిశారు.

5. అమోల్ పాలేకర్: ఈయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగాన్ని వదిలి బాలీవుడ్‌ లో తన కెరీర్‌ను కొనసాగించాడు.

6. దేవ్ ఆనంద్: బాలీవుడ్ సినీ చరిత్రలో దేవ్ ఆనంద్​కు ప్రత్యేక స్థానం ఉంది. ఓ రైటర్​గా, యాక్టర్​గా , డైరెక్టర్​గా బీటౌన్​కు ఎన్నో మరిచిపోలేని సినిమాలను అందించారు. అయితే బాలీవుడ్‌లోకి రాకముందు ఆయన సెన్సార్ బోర్డ్ క్లర్క్‌గా పనిచేసేవారు.

7. జానీ వాకర్: బ్లాక్ అండ్​ వైట్​ ఎరాలో తన కామెడీ టైమింగ్​తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వాళ్లలో ప్రముఖ హాస్య నటుడు జానీ వాకర్ ఒకరు. సినిమాల్లోకి రాకముందు ఆయన ముంబయిలో బస్ కండక్టర్​గా పనిచేశారు.

8. అమ్రిష్ పూరి: విలక్షణ నటనతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సీనియర్ నటుడు అమ్రిష్ పూరి. హిందీ పాటు పలు తెలుగు సినిమాల్లో కీ రోల్స్​ ప్లే చేశారు. అయితే ఈఎస్​ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో) బోర్డులో తనకొచ్చిన ఉద్యోగాన్ని వదులుకుని తన కలను నెరవేర్చుకునేందుకు హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత హీరో కావలనుకున్న ఆయన సినిమాల్లో క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా, విలన్​గా మెరిశారు.

9. బాల్‌రాజ్ సాహ్ని: తన రచనలతో సినీ ఇంటస్ట్రీలో సుప్రసిద్ధులైన బాల్‌రాజ్ సాహ్ని సినిమాల్లోనూ తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఇండస్ట్రీలోకి రాక ముందు బంగాల్‌ శాంతి నికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'110 గంటల పాటు బ్రేక్​ లేకుండా నటించాను' - 12th Fail హీరో సంచలన వ్యాఖ్యలు

ఫుట్​పాత్​ లైఫ్ నుంచి స్టార్ డైరెక్టర్​గా - తేజ​ పరిచయం చేసిన అందాల భామలు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.