ETV Bharat / entertainment

వాలెంటైన్స్​ డే స్పెషల్​ - జున్ను న్యూ ట్యాలెంట్​ - మురిసిపోయిన నాని - పియానో ప్లే చేస్తున్న నాని కొడుకు

Actor Nani Son Arjun : వాలెంటైన్స్​డే సందర్భంగా హీరో నాని తన తనయుడికి సంబంధించిన ఓ స్వీట్ వీడియోను షేర్ చేశారు. దాన్ని మీరూ ఓ లుక్కేయండి.

Actor Nani Son Arjun
Actor Nani Son Arjun
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 9:40 PM IST

Updated : Feb 14, 2024, 10:48 PM IST

Actor Nani Son Arjun : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన అప్​కమింగ్ మూవీస్ షూటింగ్స్​లో బిజీగా ఉన్నారు. ఇటీవలే 'హాయ్​ నాన్న' సినిమాతో సక్సెస్​ సాధించిన ఈ స్టార్ హీరో, ఇప్పుడు 'సరిపోదా శనివారం' అనే కొత్త మూవీలో నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్​ కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. అలా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ స్వీట్​ పోస్ట్​తో అభిమానులను ఆకట్టుకున్నారు.

తన తనయుడు అర్జున్ పియానో ప్లే చేస్తున్న వీడియోను ఆయన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు. దానికి హ్యాపీ వాలెంటైన్స్​ డే అంటూ క్యాప్షన్​ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు చిన్నారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తను ప్లే చేసే విధానం బాగుందని కామెంట్లు పెడుతున్నారు.

Hero Nani Career : 'అష్టాచెమ్మ' సినిమాతో వెండితెరకు హీరోగా పరిచమైన నాని ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'రైడ్', 'స్నేహితుడా', 'భీమిలి కబడ్డీ జట్టు', 'అలా మొదలైంది', 'పిల్ల జమీందార్', 'ఈగ', 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'డి ఫర్ దోపిడీ', 'పైసా', 'జండాపై కపిరాజు', 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'భలే భలే మొగాడివోయ్', 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ', 'జెంటిల్ మ్యాన్', 'మజ్ను', 'నేను లోకల్', 'నిన్ను కోరి', 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్', 'వి' సినిమాలలో పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. 'జ్యో అచ్యుతానంద', 'నీవవేరో', 'హిట్ 2' సినిమాలలో అతిధి పాత్రల్లో తెరపై కనువిందు చేశారు.

నాని లైనప్​ - కథలతో ముగ్గురు డైరెక్టర్స్
ఇప్పుడు 'సరదాగా శనివారం'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత నానితో కలిసి పని చేసేందుకు వేణు యెల్దండి, శ్రీకాంత్‌ ఓదెల కథలతో సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ లిస్ట్​లో మరో యంగ్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఆయనే సుజీత్‌. త్వరలో నాని - సుజీత్‌ కలయికలో ఓ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కథ సిద్ధమైందని, ఇది ఓ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది.

దిల్​రాజు చేతికి నాని 'సరిపోదా శనివారం' - ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ 2024 మల్టీస్టారర్​ మూవీస్​ - ఆ లెక్కలు కుదరితేనే!

Last Updated : Feb 14, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.