ETV Bharat / entertainment

2024 నేషనల్ అవార్డ్​ ఫిలిమ్స్​ - ఇవి ఏ OTTలో ఉన్నాయంటే? - 2024 National Award Films OTT - 2024 NATIONAL AWARD FILMS OTT

2024 National Award Films OTT : తాజాగా కేంద్రం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో కొన్ని చిత్రాలు అత్యధిక అవార్డులు గెలుచుకున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. ఒకవేళ మీరు వాటిని చూడకపోయి ఎంచక్కా ఈ వీకెండ్​లో చూసేయండి.

source ETV Bharat and Getty Images
2024 National Award Films OTT (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 10:28 PM IST

2024 National Award Films OTT : తాజాగా కేంద్రం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో కొన్ని చిత్రాలు అత్యధిక అవార్డులు గెలుచుకున్నాయి. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో ఉత్తమ సినిమాలు, ఉత్తమ నటీ నటులు, ఇతర కేటగిరీలకు చెందిన టెక్నీషియన్స్​కు అవార్డులు అందజేశారు. అయితే అత్యధిక అవార్డులు అందుకున్న సినిమాల్లో పొన్నియన్ సెల్వన్, కాంతార, ఆట్టం, బ్రహ్మాస్త్ర, గుల్మోహర్, ఉంచై, తిరుచిట్రంబళం ఉన్నాయి. మరి ఈ అవార్డ్ విన్నింగ్​ సినిమాలను మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే ఏ OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

  • ఉంచై (Uunchai)

సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఉంచై చిత్రానికి రెండు అవార్డులు లభించాయి. ఉత్తమ సహాయనటిగా నీనా గుప్తా, ఉత్తమ డైరెక్టర్‌గా సూరజ్ బర్జాత్యా అవార్డులు గెలుచుకున్నారు. ఈ సూపర్ హిట్ సినిమా జీ5లో ప్రసారం అవుతోంది.

  • బ్రహ్మాస్త్రం పార్ట్‌ వన్‌: శివ

బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇది AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్) కేటగిరీలో బెస్ట్‌ ఫిల్మ్‌గా నిలిచింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌, బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా అర్జిత్‌ సింగ్‌(కేసరియా) అవార్డులు గెలిచారు. ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

  • తిరుచిట్రంబళం

ఈ సినిమాలో యాక్ట్‌ చేసిన నిత్యా మేనన్, కచ్ ఎక్స్‌ప్రెస్‌లో నటించిన మానసి పరేఖ్‌తో కలిసి సంయుక్తంగా ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. అలానే ఈ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమాకు జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డులు అందుకున్నారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

  • గుల్మోహర్ (Gulmohar)

ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన గుల్మోహర్ హిందీలో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ చిత్రానికి మనోజ్ బాజ్‌పేయి బెస్ట్‌ స్పెషల్‌ మెన్షన్‌ అవార్డు గెలుచుకున్నాడు. అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెలకు బెస్ట్‌ డైలాగ్స్‌ అవార్డు లభించింది. గుల్మోహర్‌ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

  • కాంతార

రిషబ్ శెట్టి యాక్షన్ థ్రిల్లర్ కాంతారకు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి ఎంపికయ్యాడు. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు అందుకుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ కన్నడ భాషతో పాటు తమిళం, తెలుగు, మలయాళంలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

  • ఆట్టం (Aattam)

ఆనంద్ ఎకర్షి దర్శకత్వం వహించిన మలయాళం సినిమా ఆటమ్. ఈ మూవీ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు గెలిచింది. బెస్ట్‌ ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే కేటగిరీ అవార్డులు కూడా దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

  • పొన్నియిన్ సెల్వన్: I

మణిరత్నం దర్శకత్వం వహించిన ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్: I. మొత్తంగా నాలుగు అవార్డులు గెలుచుకుంది. ఏఆర్‌ రెహమాన్ బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, రవి వర్మన్ బెస్ట్‌ సినిమాటోగ్రఫీ, ఆనంద్ కృష్ణమూర్తి ఉత్తమ సౌండ్ డిజైన్‌కు అవార్డులు గెలిచారు. ఈ సినిమాకు తమిళంలో ఉత్తమ చలన చిత్రం అవార్డు కూడా దక్కింది. మీరు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

బెస్ట్​ డ్యాన్స్​ కొరియోగ్రాఫర్​గా జాతీయ అవార్డు - స్టార్​ హీరోలతో జానీ మాస్టర్​ వేయించిన స్టెప్పులివే! - Jani Master National Award

జాతీయ అవార్డుకు ఎంపికైన 'ఆట్టం' సినిమా ప్రత్యేకత ఇదే - ఏ ఓటీటీలో చూడొచ్చంటే? - Aattam Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.