Aamir Khan Gajini Movie : తన విలక్షణ నటనతో ఎటువంటి పాత్రలోనైనా నటించి మెప్పిస్తారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. బీటౌన్ ప్రేక్షకులను ఎన్నో హిట్ సినిమాలతో అలరించారు ఆయన. అయితే ఆమిర్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి 'గజనీ'. కోలీవుడ్ డైరెక్టర్ మురగదాస్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్లు సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగానూ రికార్డుకెక్కింది.
అయితే తొలుత ఈ సినిమాలోని లీడ్ రోల్ కోసం ఆమిర్‌కు బదులు ఓ స్టార్ హీరోను తీసుకోవాలని అనుకున్నారట. తాజాగా ఈ విషయాన్ని నటుడు ప్రదీప్ రావత్ వెల్లడించారు. ఆయన సూచన మేరకే ఈ మూవీ కోసం ఆమిర్‌ను తీసుకున్నట్లు తెలిపారు.
"గజనీ సినిమాను హిందీలో తెరకెక్కిస్తానని డైరెక్టర్ మురగదాస్ అంటుండేవారు. తొలుత సల్మాన్‌ఖాన్ ఈ సినిమా తీయాలన్నది ఆయన ప్లాన్. కానీ అది సరైన ఎంపిక కాదన్నది నా ఆలోచన. ఎందుకంటే సల్మాన్‌కు కాస్త కోపం ఎక్కువ. పైగా మురగదాస్ ఇంగ్లిష్, హిందీలో మాట్లాడలేరు. ఆయనది పెద్ద పర్సనాలిటీ కూడా కాదు. అప్పటికే 'సర్ఫరోష్' లాంటి సినిమాల్లో ఆమిర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఎప్పుడూ కూల్‌గా ఉండే ఆమిర్‌ను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఆమిర్ సెట్స్‌లో అరవడం, కేకలు వేయడం వంటివి నేనెప్పుడూ చూడలేదు. ఆయనపై ఎవరూ అలాంటి ఆరోపణ చేసిన సందర్భాన్ని కూడా నేను అస్సలు చూడలేదు. అందరితోనూ ఎంతో మర్యాదగా నడుచుకుంటారు. అసభ్య పదజాలాన్ని కూడా ఆయన అస్సలు ఉపయోగించరు. అందుకే సల్మాన్‌ను ఎంపిక చేసుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయని నేను మురుగదాస్‌తో చెప్పాను. అలా ఆమిర్ ఈ సినిమాకు ఎంపికయ్యారు" అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చారు.
ఇక ఆమిర్ కోసం దాదాపు ఆరు నెలల పాటు మురుగదాస్ వెయిట్ చేశారట. ఆయన వెంట పడి పడి ఆయన ఒప్పించేదుకు ప్రయత్నించారట. దీంతో తమిళ 'గజనీ' చూసిన ఆమిర్, వెంటనే హిందీలో రీమేక్ చేయడానికి ఓకే చెప్పారట.
5 సెకన్ల సినిమా ఛాన్స్ - స్టార్‌గా మారిన బిచ్చగాడు - గర్ల్ ఫ్రెండ్ కూడా! - PK Aamir Khan Movie