Game Changer Hindi Rights : నార్త్‌లో టాలీవుడ్ సౌత్ హీరోలకు బాగా క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రేక్షకులు మన హీరోల సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ చిత్రాలకు ఫిదా అయిపోతున్నారు. దీంతో మన సినిమాలకు అక్కడ బిజినెస్ భారీగా జరగడంతో పాటు బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. తాజాగా రామ్ చరమ్ గేమ్ ఛేంజర్ కూడా హిందీలో భారీ బిజినెస్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత అనిల్ తడాని గేమ్ ఛేంజర్ హక్కులను కొనుగోలు చేశారట. ఇప్పటికే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రానున్న పుష్ప -2(Pushpa 2 Hindi Rights) సినిమాకు సంబంధించి హిందీ థియేట్రికల్ రైట్స్‌ను ఆయనే కొనుగోలు చేశారు. రూ.200 కోట్లకు తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
ఇప్పుడేమో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రైట్స్‌ను కూడా దక్కించుకున్నారు. దాదాపు రూ.100 కోట్లకు కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తోంది. పైగా నార్త్ ఇండియాలో గేమ్ ఛేంజర్ ఇన్పాక్ట్ బాగానే కనిపిస్తోంది. ఈ మూవీ హిట్ సాధిస్తే రామ్ చరణ్ క్రేజ్ మరో మెట్టు పెరగొచ్చు. చూడాలి మరి గేమ్ ఛేంజర్ ఎలాంటి టాక్‌ను అందుకుంటుందో.
Game Changer Shankar : దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శంకర్ భారతీయుడు2, 3 చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతూ వచ్చింది. దీనికి తోడు భారీ తారాగణం నటిస్తుండటం వల్ల తేదీలను సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించింది. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
'20 ఏళ్ల తర్వాత రోలెక్స్ కోసమే అలా చేశా - కమల్‌హాసన్ అంటే భయమేసింది!' - సూర్య
సందీప్ సూపర్ ప్లాన్! - 'స్పిరిట్'లో ప్రభాస్ పోలీస్‌గానే కాదు ఆ పాత్రలోనూ!