ETV Bharat / entertainment

'సాయి పల్లవి ఫ్యాన్స్ నుంచి ఒకటే కాల్స్- రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాల్సిందే!'

సినిమాలో ఫోన్​ నెంబర్ వాడిన చిత్ర బృందం - 'అమరన్​' టీమ్​ను 1.1 కోట్ల నష్ట పరిహారం డిమాండ్ చేసిన కాలేజీ స్టూడెంట్​.

Siva Karthikeyan Amaran Movie
Sai Pallavi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 3:25 PM IST

Amaran Movie Student Case : శివ కార్తికేయన్, సాయి పల్లవి లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్​ బ్లాక్​బస్టర్ మూవీ 'అమరన్'. రీసెంట్​గా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం సక్సెస్​ఫుల్​గా థియేటర్లలో రన్ అవుతోంది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి టాక్ అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్ర మేకర్స్​పై ఓ కాలేజీ స్టూడెంట్ నోటీసులు పంపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఆ ఫోన్ నెంబర్ వల్లనే!
విఘ్నేశన్‌ అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి తాజాగా మూవీ టీమ్​కు నోటీసులు పంపించాడు. తన నెంబర్​ను ఈ సినిమాలో చూపించారని, దాని వల్ల తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్స్‌ నుంచి తనకు చాలా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని అన్నాడు. దీని వల్ల అతడు బాగా ఇబ్బందిపడుతున్నానని, ఎంతో మానసిక వేదనకు గురయ్యానని వాపోయాడు. ఈ క్రమంలో తనకు రూ.కోటి నష్టపరిహారంగా డిమాండ్‌ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త నెట్టింట తెగ ట్రెెండ్ అవుతోంది.

ఇక 'అమరన్' విషయానికి వస్తే, దీపావళి సందర్భంగా బాక్సాఫీస్​ ముందుకొచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎమోషనల్​గా బాగా కనెక్ట్ అయ్యారు. 2014లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్‌ వరదరాజన్‌ మృతి చెందారు. ఆయన జీవిత ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్​ ముకుంద్‌గా శివకార్తికేయన్, తన భార్య ఇందు పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ఆడియెన్స్​ నుంచి ప్రశంసలను అందుకున్నారు. వీరిద్దరి నటన, డైరెక్టర్​ రాజ్​ కుమార్ పెరియసామి టేకింగ్‌పై సినీ దిగ్గజాలు కూడా పొగడ్తల వర్షం కురిపించారు.

కమల్ హాసన్ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ రాజ్​కమల్ బ్యానర్‌పై సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళంలో ఈ సినిమా మంచి ఆదరణను అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక 'అమరన్' నవంబరు చివర్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్​ ఈ చిత్రాన్ని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

'అమరన్‌' - థియేటర్‌పై పెట్రోల్‌ బాంబులతో దాడి

ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్​కు 'అమరన్' హీరో స్పెషల్ గిఫ్ట్ - ఏం ఇచ్చారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.