ETV Bharat / entertainment

ఓటీటీలోకి నివేథా సూపర్ హిట్ మూవీ - '35 చిన్న కథ కాదు' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? - 35 Chinna Katha Kaadu OTT Release

35 Chinna Katha Kaadu OTT Release : మాలీవుడ్ స్టార్ హీరోయిన్​ నివేథా థామస్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ క్లాసిక్ హిట్ మూవీ 35 చిన్న కథ కాదు మూవీ ఓటీటీలో

35 Chinna Katha Kaadu OTT Release
Nivetha Thomas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 7:24 PM IST

35 Chinna Katha Kaadu OTT Release : మాలీవుడ్ స్టార్ హీరోయిన్ నివేదా థామస్‌, విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ '35 చిన్న కథ కాదు'. ట్రైలర్, టీజర్​తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్​గా నిలిచింది. అయితే ఇటీవల థియేటర్​లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ ఆడియెన్స్​ను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్ 'ఆహా' వేదికగా అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. "ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది." అంటూ ఆహా షేర్ చేసిన పోస్టర్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.

స్టోరీ ఏంటంటే?
ప్ర‌సాద్ (విశ్వ‌దేవ్ రాచ‌కొండ) ఓ బ‌స్ కండ‌క్టర్‌. ఆయ‌న భార్య స‌ర‌స్వ‌తి (నివేదా థామ‌స్). త‌న భ‌ర్త‌, పిల్ల‌లు అరుణ్‌, వ‌రుణ్ వీరే తన ప్రపంచంగా బ‌తుకుతున్న సాధారణ గృహిణి ఆమె. తిరుప‌తిలో నివాసం ఉంటుంటారు. చిన్నోడు ఫర్వాలేదు కానీ, పెద్దోడికి (అరుణ్‌) మాత్రం లెక్క‌ల పాఠాలు ఓ ప‌ట్టాన అర్థం కావు. సున్నాకి విలువ లేన‌ప్పుడు దానిప‌క్క‌న ఒక‌టి వ‌చ్చి నిల‌బ‌డితే కూడా ప‌ది ఎందుకవుతుంద‌ంటూ అడుగుతుంటాడు. త‌ను అడిగే ఇటువంటి ప్ర‌శ్న‌ల‌కు టీచ‌ర్లు కూడా స‌మాధానాలు చెప్పలేకపోతుంటారు.

దాంతో లెక్క‌ల మాస్టారు చాణ‌క్య (ప్రియ‌ద‌ర్శి) ఫండమెంటల్స్‌ను ప్ర‌శ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి లాస్ట్ బెంచ్​లో కూర్చోబెడుతాడు. అంతేకాకుండా ఆరో త‌ర‌గ‌తిలో ఫెయిల్ కూడా చేస్తాడు. దీంతో త‌న త‌మ్ముడి క్లాస్‌లో కూర్చోవాల్సి వ‌స్తుంది. ఈసారి అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే మాత్రం అతడు లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందే అని షరతు పెడుతారు. ఆ ప‌రిస్థితుల్లో జీరో అని పేరు తెచ్చుకున్న అరుణ్ క్లాస్‌లో హీరో ఎలా అయ్యాడు? త‌న కొడుక్కి లెక్క‌ల పాఠాలు అర్థం కావాల‌ంటూ టెన్త్ ఫెయిల్ అయిన త‌ల్లి స‌ర‌స్వతి ఏం చేసింది? అరుణ్ అస‌లు 35 మార్కులు తెచ్చుకున్నాడా లేదా? అనేదే మిగ‌తా స్టోరీ.

తల్లి పాత్రలో నివేదా థామస్ - '35 చిన్న కథ కాదు' ఎలా ఉందంటే? - 35 Chinna Katha Kadu Telugu Review

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.