ETV Bharat / entertainment

9ఏళ్లుగా నో హిట్- అయినా ఈ భామకు రూ.27కోట్ల రెమ్యూనరేషన్! - కంగనా రనౌత్ రెమ్యూనరేషన్

27 Crore Remuneration Heroine: ఒకప్పుడు బాక్సాఫీస్​ కలెక్షన్ క్వీన్. ప్రస్తుతం తన చివరి మూడు సినిమాలకు కనీసం రూ.10 కోట్లు కూడా కలెక్షన్స్ రాలేదు. అయినప్పటికీ 2023లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొని టాప్ హీరోయిన్ల సరసన నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరంటే?

27 Crore Remuneration Heroine
27 Crore Remuneration Heroine
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 12:09 PM IST

27 Crore Remuneration Heroine: బాలీవుడ్​లో ఒకట్రెండు ఫ్లాపులు పడితే చాలు, ఆ హీరోయిన్ అవకాశాలు, డిమాండ్ తగ్గడం మామూలే. ఇక రెండుమూడేళ్లు సినిమాల్లో కనిపించకపోతే ప్రేక్షకులు తమను మర్చిపోతారేమోనని ఆందోళన చెందుతుంటారు. అలాంటిది ఓ హీరోయిన్​కు దాదాపు 9ఏళ్ల నుంచి సరైన హిట్ సినిమా లేదు. అది కాకుండా ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు. అయినప్పటికీ ఇవన్నీ కూడా 2023లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్​ లిస్ట్​లో ఆమె పేరు చేరకుండా ఆపలేకపోయాయి. ఈ నటి ఎవరో కాదు బీటౌన్ బ్యూటీ కంగనా రనౌత్. ఈ భామ ప్రస్తుతం ఒక్కో సినిమాకుగాను రూ.27 కోట్ల పారితోషికం అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.

తన నటనతో కంగనా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. అందులో ముఖ్యంగా 'క్వీన్', 'తను వెడ్స్ మను' సినిమాలు సూపర్ హిట్ కావడమే కాకుండా ఆమెకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి. అయితే అదంతా గతం. 2015 తర్వాత సీన్ మారింది. ఈ సంవత్సరం విడుదలైన 'తను వెడ్స్ మను- 2' తర్వాత కంగనాకు సరైన హిట్ లేదు.

2015-18 దాదాపు మూడేళ్లు కంగనాకు బ్యాడ్​టైమ్ నడిచిందనే చెప్పాలి. అయితే 2018లో తెలుగు డైరెక్టర్​ క్రిష్ దర్శకత్వం వహించిన 'మణికర్ణిక' యావరేజ్​గా నిలిచింది. ఈ సినిమా రూ.100కోట్లు వసూల్ చేసినప్పటికీ, దాని బడ్జెట్​తో పోల్చుకుంటే తక్కువే. ఇక ఆమె చివరి మూడు సినిమాలు 'తేజస్', 'ధాకడ్', 'తలైవీ' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. కానీ, ఈ సినిమాల్లో కంగనా నటనుకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇక కంగనా తన తదుపరి చిత్రాలతో సత్తా చాటాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు కంగనాయే దర్శకత్వం వహిస్తోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా 2024 జూన్​ 14న రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చైల్డ్ ఆర్టిస్ట్​గా ఎంట్రీ- IAS కావాలని ఇండస్ట్రీకి దూరం!- ఆ నటి ఎవరంటే?

ట్విట్టర్​ గూటికి తిరిగొచ్చిన కంగన.. 'క్వీన్ ఈజ్​ బ్యాక్'​ అంటూ ఫ్యాన్స్​ ఖుషీ​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.