2024 Second Half Movies: సౌత్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రత్యేకించి తెలుగు చిత్రం రిలీజ్ అవుతుందంటే ఇండియా సినీఇండస్ట్రీ మొత్తం కళ్లప్పగించి చూస్తుంది. అలా పెరిగింది మరి టాలీవుడ్ క్రేజ్. కానీ, ఎంత హైప్ ఉన్నప్పటికీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కిన బడా హీరో సినిమాలన్నీ 2024 సంవత్సరం ఫస్ట్ హాఫ్ (తొలి ఆరు నెలలు) ఖాళీగా వదిలేశాయి. సాధారణంగా తొలి ఆరు నెలలు సంక్రాంతి, వేసవి సీజన్‌ను టార్గెట్‌గా రిలీజ్‌లు చేసుకునేవారు. మధ్యలో వీకెండ్‌లు, సెలవులు కలిసొస్తే ఆ మూమెంట్‌ను కూడా క్యాష్ చేసుకునేందుకు పెద్ద సినిమాలు వచ్చేవి.
వాటన్నిటినీ వృథా చేసేయడంతో 2024 తొలి ఆరు నెలల కాలం చెప్పుకోదగ్గ సినిమా లేకుండానే గడిచిపోయింది. పెద్ద సినిమాలు వస్తాయనే ఆలోచనలో చిన్న సినిమాలు వెనుకడుగేయడంతో సినీ ప్రేక్షకులకు పాత సినిమాలే దిక్కయ్యాయి. పాన్ ఇండియా సినిమాల షూటింగులు ఆలస్యం కారణంగా వాయిదాలు పడుతూ 'కల్కి 2898 ఏడీ' మినహాయించి మిగిలినవన్నీ సెకండాఫ్ లోనే రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. వచ్చే నెల వరకూ 'కల్కి 2898 ఏడీ' జోరు కొనసాగనున్న క్రమంలో ఆ తర్వాత ఒకొక్కటిగా భారీ బడ్జెట్ పాన్ఉండియా సినిమాలు రానున్నాయి. మరి 2024 సెకండ్ హాఫ్‌లో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలేవో చూద్దాం.
- భారతీయుడు -2: కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో రెండు దశాబ్దాల క్రిందట రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు కొనసాగింపు ఇది. జులై 12న థియేటర్లలోకి తీసుకురానున్నారు.
- డబుల్ ఇస్మార్ట్: రామ్ - పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రం కూడా సీక్వెలేనని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లోనే రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ఇది. దీంతో పాటుగా నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో 'సరిపోదా శనివారం' కొద్ది రోజుల గ్యాప్‌లో రిలీజ్ కానుంది.
- దేవర -1 : సెప్టెంబరులో ఎన్టీఆర్ దేవరగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొరటాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబరు 27న రిలీజ్ చేయాలని టీం ఫిక్సయిపోయింది.
- ఆ తర్వాత తమిళ స్టార్ యాక్టర్ విజయ్ నటించిన గోట్ విడుదల కానుండగా, దసరా సీజన్ కోసం అక్టోబర్ 10న రజనీకాంత్ వెట్టయాన్, సూర్య హీరోగా కంగువా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
- గేమ్ ఛేంజర్: భారతీయుడితో పాటుగా ఏకకాలంలో శంకర్ డైరక్షన్ చేసిన సినిమా గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే అక్టోబర్ 31 నాటికి గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
- పుష్ప - 2: ఆగష్టు 15న విడుదల చేయాలని ప్లాన్ చేసిన పుష్ప-2 డిసెంబరు 6వరకూ వాయిదా పడింది. పుష్పకు సీక్వెల్ గా దీనిని సుకుమార్ సిద్ధం చేస్తున్నారు. దీని తర్వాత విక్రమ్ తంగలాన్ విడుదల అవనుంది. ఇక నితిన్ నటించి రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ కూడా రిలీజ్ కోసం ముస్తాబవుతున్నాయి.
తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం సిద్ధమవుతోన్న సినిమాల బడ్జెట్ దాదాపు రూ.4వేల కోట్లు ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్టాఫ్ ఎలా ఉన్నా సెకండాఫ్ మొత్తం నెలకు ఒకట్రెండు సినిమాలు రిలీజ్ కానుండటంతో వ్యాపారం మొదలైందని అంటున్నాయి సినీ వర్గాలు.
'కల్కి' సూపర్ హిట్ - మరి నెక్స్ట్ ఏంటి డార్లింగ్? - Prabhas Ucpoming Movies
బాక్సాఫీస్ షేక్ - దళపతి విజయ్ టాప్ టెన్ సినిమాలివే! - Happy Birthday Vijay Thalapathy