2024 Oscar Movie Nominations: ప్రపంచ సినీ రంగంలో ఆస్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మక భావించే పురస్కారం. నటీనటులు తమ కెరీర్లో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలనుకుని ఎంతో మంది కళాకారులు ఆరాటపడుతుంటారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఒక విజయం అయితే, ఆస్కార్‌ను అందుకోవడం తమ జీవితంలో ఓ వరంలా భావిస్తుంటారు. ఇక ఆ సినిమా ఆస్కార్ బరిలో నామినేషన్ సాధించినవైతే అది మరో ఘనత. అయితే 2024 మార్చి 10న (భారత కాలమానం ప్రకారం మార్చి 11 ఉదయం 4.30గంటలకు) జరగనున్న 96వ ఆస్కార్ పురస్కారాల్లో సత్తా చాటేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటంటే?
- బార్బీ: అందరికీ నచ్చేది, అన్నివయసుల వారు మెచ్చేది బార్బీ బొమ్మ. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ పేరుతో తెరకెక్కిన బార్బీ సినిమా కూడా వినోదాన్ని పంచుతూ ఆస్కార్ రేసులో నిలిచింది. ఇక 2023లో భారీ వసూళ్లును సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక టాప్- 10 సినిమాల జాబితాలో నిలిచిన ఈ చిత్రం ఎనిమిది నామినేషన్లతో ఆస్కార్ రేసులో దిగింది.
- అనాటమీ ఆఫ్ ఎ ఫాల్: 'బ్లైండ్ వ్యక్తి ఓ హత్యకు సాక్షి' అనే ట్రాక్‌తో తెరకెడం వల్లే అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ ఆస్కార్ రేస్‌లో నిలిచింది. దర్శకురాలు జస్టీన్ ట్రియెల్ ఈ సినిమాను ఫ్రెంచ్ లీగల్ డ్రామా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించింది. గతేడాది భారీ విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా 2024 ఆస్కార్‌లో ఐదు నామినేషన్లతో ఉంది.
- పాస్ట్ లీవ్స్: బాల్యమిత్రులను దాదాపు 12ఏళ్ల తర్వాత విధి కలిపింది. అలా కలిసిన ఇద్దరిలో ప్రేమ కావాలని ఒకరు, స్నేహితులుగానే ఉండిపోవాలని మరోకరు అనుకుంటారు. రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీనీ సెలీనా సాంగ్ డైరెక్ట్ చేసింది. కాగా ఈ సినిమా రెండు విభాగాల్లో నామినేషన్లను సొంతం చేసుకుంది.
- ది హోల్డ్‌ఓవర్స్: ప్రతి ఏడాది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది రెండు వారాలపాటు సెలవులు తీసుకుంటారు. కానీ, ఆ సెలవులకు వెళ్లని దురదృష్టవంతులనే ది హోల్డ్‌ఓవర్స్ అంటారు. కామెడీ డ్రామాగా రూపొందిని ఈ చిత్రం ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇక ప్రశంసలతో పాటు ఆస్కార్‌లో కూడా తన సత్తా చాటుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఈ సినిమా అయిదు విభాగాల్లో నామినేషన్లతో ఆస్కార్‌లో ఉంది.
- అమెరికన్ ఫిక్షన్: ఓ నవలా రచయిత- ప్రొఫెసర్ చుట్టూ తిరిగే కథనంతో ఈ సినిమా తెరెక్కింది. గతేడాది కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. రీసెంట్గా బాఫ్టాలో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డునూ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ ఉత్తమ చిత్రం సహా 5 విభాగాల్లో నామినేట్ అయ్యింది.
- ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: 2014లో మార్టిన్ అమిస్ రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు జోనాథన్ గ్లేజర్ హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కించాడు. క్రిస్టియన్ ఫ్రిడెల్, సాండ్రా హుల్లర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ఇటీవల జరిగిన బాఫ్టా వేడుకల్లో మూడు అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో ఐదు విభాగాల్లో నామినేట్ అయ్యింది.
- పూర్‌థింగ్స్: విక్టోరియన్ లండన్‌లోని బెల్లా బాక్ట్సర్ అనే యువతి తన మరణం తర్వాత ఒక శాస్త్రవేత్త ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంటుందనేదే ఈ సినిమా కథనం. 1992లో అలాస్డర్ గ్రే రచించిన పుస్తకం ఆధారంగా ఈ మూవీ తెకరకెక్కింది. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఐదు బాఫ్టా అవార్డులను అందుకున్న పూర్‌థింగ్స్ ఆస్కార్ బరిలో పదకొండు విభాగాల్లో నామినేషన్లను పొందింది.
- ఓపెన్ హైమర్: ప్రస్తుతం అవార్డ్ బరిలో సినిమాల్లోకెల్లా ఓపెన్ హైమర్కే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఈ సినిమా రూపొందింది. ఆస్కార్ పురస్కార వేడుకల్లో ఏకంగా 13నామినేషన్లతో ముందు వరుసలో ఉంది.
- మాస్ట్రో: ప్రేమ పెళ్లి చేసుకున్న లినార్డో- ఫెలిసియా మధ్య కొన్ని రోజులకే విభేదాలు మొదలవుతాయి. తప్పు తెలుసుకునే నాటికి ఫెలిసియా ఆరోగ్య సమస్యలతో మరణిస్తుంది. వారి ప్రేమకు ఆ మరణం ముగింపు పలుకుతుంది. నవంబరు 22న విడుదలైన ఈ చిత్రం ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఆస్కార్‌లో కూడా ఏడు నామినేషన్లను దక్కించుకుంది.
- కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: 2017లో డెవిడ్ గ్రాన్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఒసాజ్ ప్రజలు నివసించే స్థలంలో చమురు కనుగొన్న తర్వాత ఒసాజ్ సభ్యుల వరుస హత్యల ఆధారంగా తెరకెక్కింది. వారి సంపదను దొంగిలించడానికి రాజకీయ నేత ప్రయత్నిస్తాడు. దాని ఆధారంగానే దర్శకుడు మార్టిన్ స్కోర్కెస్ తెరకెక్కించాడు. గతేడాది అక్టోబర్ 20న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం ఆస్కార్‌లో 10 విభాగాలలో నామినేట్ అయ్యింది.
-
Tomorrow. 96th Oscars. Who will win?
— The Academy (@TheAcademy) March 9, 2024
Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 10th at a new time, 7e/4p! #Oscars pic.twitter.com/d8TqSvFYRD
-
ఓటీటీలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక - లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఆస్కార్ బరిలో ఎనిమిది సార్లు - భారత్ తరఫున అత్యధిక నామినేషన్లు అందుకున్న స్టార్ ఎవరంటే ?