ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో - యూనియన్ బ్యాంక్‌లో 1500 ఆఫీసర్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

యూనియన్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్‌ పోస్టులు - ఏపీలో 200, తెలంగాణలో 200 పోస్టులు - సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే?

Union Bank of India
Union Bank of India (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Union Bank Recruitment 2024 : బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్‌. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు

  • ఆంధ్రప్రదేశ్‌ - 200 పోస్టులు
  • తెలంగాణ - 200 పోస్టులు
  • కర్ణాటక - 300 పోస్టులు
  • తమిళనాడు - 200 పోస్టులు
  • ఒడిశా - 100 పోస్టులు
  • మహారాష్ట్ర - 50 పోస్టులు
  • కేరళ - 100 పోస్టులు
  • బంగాల్‌ - 100 పోస్టులు
  • గుజరాత్ - 200 పోస్టులు
  • అసోం - 50 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1500

విద్యార్హతలు
అభ్యర్థులు రెగ్యులర్ బేసిస్‌లో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే వారికి స్థానిక భాష కచ్చితంగా ఉండాలి. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి. అలాగే మిగతా రాష్ట్రాల అభ్యర్థులకు వారి స్థానిక భాష వచ్చి తీరాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 20-30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్ ఫీజు

  • జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.850 చెల్లించాలి.
  • దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.175 అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్‌ (పెట్టవచ్చు!), పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం
ఆన్‌లైన్‌ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఇస్తారు. వీటికి 200 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్‌ కట్‌ అవుతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • లోకల్ బ్యాంక్ ఆఫీసర్‌ (LBO) అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన అన్ని వివరాలు నమోదు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • వెంటనే మీకొక రిజిస్ట్రేషన్ నంబర్‌, పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది.
  • వీటితో మళ్లీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్‌ చేసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
  • వెంటనే మీకొక యూనిక్‌ నంబర్ జనరేట్ అవుతుంది. దానిని నోట్ చేసుకోవాలి.
  • భవిష్యత్‌ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్‌అవుట్‌ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 అక్టోబర్ 24
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 నవంబర్‌ 13

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.