ETV Bharat / education-and-career

సైన్స్​ & టెక్నాలజీ టు మార్కెటింగ్, ఏదైనా ఇక్కడ నేర్చుకోవచ్చు​! టాప్​-30 ఆన్​లైన్​ లెర్నింగ్​ వెబ్​సైట్స్​ ఇవే! - Top Online Learning Websites List

Top Online Learning Websites List : మీరు ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్, హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ప్రపంచవ్యాప్తంగా మీకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి, మీకు ఆసక్తి ఉన్న కోర్సులను నేర్చుకోవడానికి ఉన్న టాప్-30 ఆన్​లైన్ లెర్నింగ్ సైట్స్​ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Top Online Learning Websites List
Top Online Learning Websites List (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 1:20 PM IST

Top Online Learning Websites List : కృత్రిమ మేధస్సు(ఏఐ), కంప్యూటర్ సైన్స్, ఆరోగ్యం, విద్య, చరిత్ర, వంటి వాటి కోసం తెలుసుకోవాలని ప్రస్తుతం కాలంలో చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. పలు కోర్సులను ఇంటర్నెట్ ద్వారా ఆన్​లైన్​లో నేర్చుకోవాలనుకుంటారు. అలాంటి వెబ్​సైట్స్​లో కొన్ని ఉచితంగా క్లాసులు అందిస్తాయి. మరికొన్నింటికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ సర్టిఫికెట్​ను సైతం అందిస్తాయి. అలాంటి బెస్ట్ 30 ఆన్‌లైన్ లెర్నింగ్ సైట్స్ ఎంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. అకడమిక్ ఎర్త్(Academic Earth)
అకడమిక్ ఎర్త్ అనేది ప్రపంచంలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కాలేజీల ఉచిత ఆన్​లైన్ కోర్సుల సమాచారాన్ని ఇస్తుంది. ఈ లెర్నింగ్ సైట్ 2009లో ప్రారంభమై ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సైట్​లో చాలా సబ్జెక్ట్​లపై కోర్సులు ఉంటాయి. మీకు కావాల్సిన యూనివర్సిటీ పేరు టైప్​ చేసి అవి అందించే కోర్సులు నేర్చుకోవచ్చు.

2. అలిసన్ లెర్నింగ్ పాత్స్(Alison Learning Paths)
అలిసన్ లెర్నింగ్ పాత్స్ అనేది పలు రంగాలకు చెందిన నిపుణులు రూపొందించిన ఉచిత ఆన్​లైన్ కోర్సులను అందిస్తుంది. మార్కెటింగ్, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కోర్సులను నేర్చుకోవచ్చు.

3. బెటర్ ఎక్స్‌ప్లెయిన్డ్(BetterExplained)
మ్యాథ్స్ నేర్చుకోవాలనుకునేవారికి బెటర్ ఎక్స్ ప్లెయిన్డ్ లెర్నింగ్ సైట్ పనికొస్తుంది. ఇందులో ఆన్‌ లైన్ క్లాసులు ఉచితం. మీకు పాఠ్యపుస్తకాల పీడీఎఫ్, వీడియో లెస్సన్స్, క్విజ్​లు వంటివి కావాలంటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

4. కాన్వాస్ నెట్‌ వర్క్(Canvas Network)
కాన్వాస్ నెట్​వర్క్ అనేది అధ్యాపకులకు ప్రొఫెషనల్ డెవలప్​మెంట్ కోర్సులను అందిస్తుంది. ఇందులో పలు భాషల్లో కోర్సులను చేయవచ్చు. ఇది టీచర్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది.

5. కానగీ మెల్లన్ ఓపెన్ లెర్నింగ్ ఇనిషియేటివ్(Carnegie Mellon Open Learning Initiative)
అమెరికాలోని కానగీ మెల్లన్ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్​మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కెమిస్ట్రీతో పాటు ప్రొఫెషనల్ డెవలప్​మెంట్‌ కోర్సులను అందుబాటులో ఉంచుతుంది. ఈ లెర్నింగ్ సైట్​లో ఉచితంగా కొన్ని కోర్సులను నేర్చుకోవచ్చు.

6. కోడ్​కాడెమీ(Codecademy)
ఫ్రీలాన్స్ కెరీర్​ను ఎంచుకునేవారికి కోడెకాడెమీ ఉపయోగపడుతుంది. పైథాన్, రూబీతో సహా పలు కంప్యూటర్ కోర్సులను నేర్చుకోవచ్చు.

7. కోర్సెరా(Coursera)
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆన్ లైన్ డిగ్రీని సంపాదించుకోవడానికి కోర్సెరా ఈ లెర్నింగ్ సైట్ ఉపయోగపడుతుంది.

8. డ్రాస్పేస్(Drawspace)
డ్రాయింగ్, పెయింటింగ్ నేర్చుకోవాలనుకునేవారికి డ్రాస్పేస్ లెర్నింగ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఆర్టిస్ట్​గా మారాలనుకున్నవారికి ఈ సైట్ బాగా యూజ్ అవుతుంది.

9. ఈడీఎక్స్(edX)
ఈడీఎక్స్ అనేది హార్వర్డ్ యూనివర్సిటీ, మసాటుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కలిసి స్థాపించిన ఆన్​లైన్ లెర్నింగ్ ప్లాట్​ఫామ్. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, సైకాలజీ, రైటింగ్, ఎలక్ట్రానిక్స్, బయాలజీ, మార్కెటింగ్ వంటి సబ్జెక్ట్​లలో కోర్సులు చేయవచ్చు.

10. ఫ్యూచర్ లెర్న్ ( FutureLearn)
ఫ్యూచర్ లెర్న్ సైట్ గ్లాస్గో విశ్వవిద్యాలయం, కింగ్స్ కాలేజ్ వంటి 260కి పైగా అగ్రశ్రేణి యూనివర్సిటీల్లోని ఆన్‌ లైన్ కోర్సులను అందిస్తుంది. కాపీ రైటింగ్, ఏఐ, బయోకెమిస్ట్రీ, పర్సనాలిటీ డెవలప్ మెంట్ వంటి కోర్సులను చేయవచ్చు.

11. జనరల్ అసెంబ్లీ(eneral Assembly)
డిజైన్, వ్యాపారం, సాంకేతికతపై కోర్సు చేయాలనుకునేవారికి జనరల్ అసెంబ్లీ బాగా ఉపయోగపడుతుంది.

12. జీఎఫ్ సీ గ్లోబల్(GFCGlobal)
జీఎఫ్​సీ గ్లోబల్ అనేది గత 20 ఏళ్లుగా ఫైనాన్స్, ఫ్రీలాన్స్ వర్క్, ఇంటర్నెట్, కంప్యూటర్ స్కిల్స్​పై ఉచిత తరగతులు నిర్వహిస్తోంది.

13. హాక్ డిజైన్(Hack Design)
డిజైన్​ను వృత్తిగా ఎంచుకున్నవారికి హాక్ డిజైన్ పనికొస్తుంది.

14. హార్వర్డ్ ఆన్‌ లైన్ కోర్సులు(Harvard Online Courses)
బిజినెస్ డెవలప్​మెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్​లపై ఆసక్తి ఉండేవారి కోసం హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ కోర్సుల మెటీరియల్​ను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచుతుంది.

15. HTML డాగ్
వెబ్​సైట్​ బిల్డ్​ చేయడానికి కావాల్సిన HTML, CSS, జావా స్క్రిప్ట్​ వంటి లాంగ్వేజలను నేర్చుకోవాలనేవారికి ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది.

16. ఇన్‌ స్ట్రక్టబుల్స్(Instructables)
ఈ లెర్నింగ్ సైట్​లో ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్​కు సంబంధించిన కోర్సులను నేర్చుకోవచ్చు.

17. ఐవర్సిటీ(Iversity)
యూరోపియన్​, ఇంటర్​నేషనల్ విశ్వవిద్యాలయాలతో ఈ ఐవర్సిటీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సాఫ్ట్ వేర్ కు సంబంధించిన తరగతులు ఇందులో ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

18. ఖాన్ అకాడమీ(Khan Academy)
ఖాన్ అకాడమీ అనేది ఒక లాభాపేక్ష లేని ఆన్​లైన్ ప్లాట్‌ ఫామ్. గణితం, సైన్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్​కు సంబంధించిన వీడియోలను, మెటిరీయల్ ను ఉచితంగా అందిస్తుంది.

19. లైఫ్‌ హాక్(LifeHack)
హ్యాకింగ్ సంబంధించిన కోర్సును అందిస్తుంది లైఫ్ హాక్. ఉచితంగా పుస్తకాలు, క్లాసులను అందిస్తుంది.

20. లింక్డిన్ లెర్నింగ్(LinkedIn Learning)
కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కెరీర్ గైడెన్స్ గురించి లింక్డిన్ లెర్నంగ్ తెలియజేస్తుంది.

21. మాస్టర్‌క్లాస్(MasterClass)
మాస్టర్ క్లాస్ 180కి పైగా వ్యక్తిగత కోర్సులకు యాక్సెస్ ఇస్తుంది. మీరు ఆన్​లైన్​లో క్లాసులను వినవచ్చు. మాస్టర్ క్లాస్ యాప్​లో మెటీరియల్​ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వంట, సైన్స్, ఆరోగ్యం, ఆహారం వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు. ఈ యాప్​ యాక్సెస్​ ఫీజు నెలకు 10 డాలర్ల నుంచి స్టార్ట్​ అవుతుంది.

22. MIT ఓపెన్ కోర్స్ వేర్(MIT OpenCourseWare)
ప్రముఖ అధ్యాపకులు రాసిన బుక్స్ ఆన్​లైన్ వెర్షన్ లు ఇందులో అందుబాటులో ఉంటాయి. బిజినెస్, ఫైన్ ఆర్ట్స్, గణితం, సైన్స్, టీచింగ్ వంటి అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులను చేయవచ్చు.

23. ఓపెన్ కల్చర్(Open Culture)
ప్రముఖ యూనివర్సిటీల నుంచి దాదాపు 1700 ఆన్​లైన్ ఎడ్యుకేషన్ కోర్సులను ఓపెన్ కల్చర్ ఉచితంగా అందిస్తుంది.

24. ఓపెన్ యేల్ కోర్సులు( Open Yale Courses)
జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటి వంటివాటిని ఓపెన్ యేల్ విశ్వవిద్యాలయం అందించే కోర్సులు ద్వారా నేర్చుకోవచ్చు.

25. థింక్ ఫుల్(Thinkful)
సాఫ్ట్‌ వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులను నేర్చుకోవాలనుకునే థింక్ ఫుల్ ఉపయోగపడుతుంది. ఇందులో ఐదు నెలల కన్నా ఎక్కువ గడువుతో ఉండే ఫుల్​టైమ్​ కోర్సులు ఉంటాయి. వివిధ కోర్సులకు ట్యూషన్​ ఫీజు 8500 డాలర్ల నుంచి మొదలవుతుంది.

26. స్కిల్ క్రష్(Skillcrush)
డిజిటల్ మార్కెటింగ్, HTML కోడింగ్ వంటి వాటిని స్కిల్ క్రష్ ద్వారా నేర్చుకోవచ్చు.

28. స్టాన్‌ ఫోర్డ్ ఇంజనీరింగ్ ఎవ్రీవేర్(Stanford Engineering Everywhere)
స్టాన్‌ ఫోర్డ్ ఇంజినీరింగ్ ఎవ్రీవేర్ ఎటువంటి రుసుము లేకుండా క్లాసులను అందిస్తుంది. ఇందులో ఇంజనీరింగ్‌, ఏఐ కోర్సులను నేర్చుకోవచ్చు.

29. ఉడాసిటీ(Udacity)
డేటా సైన్స్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్​ ను ఉడాసిటీలో నేర్చుకోవచ్చు. ఉడాసిటీ యాక్సెస్​ ఫీజు నెలకు 399 డాలర్లు నుంచి స్టార్ట్​ అవుతుంది.

30. ఉడెమీ(Udemy)
వ్యాపారం, ఎంఎస్​ఎక్స్​ ఎల్, కంటెంట్​ రైటింగ్​, సాఫ్ట్​వేర్​ వంటి చాలా రకాల కోర్సులను ఉడెమీలో నేర్చుకోవచ్చు. వీడియో లెస్సన్స్​ రూపంలో ఉండే ఈ కోర్సులకు రుసుములు వసూలు చేస్తుంది ఉడెమీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.