ETV Bharat / education-and-career

ఫారిన్​లో హయ్యర్ స్టడీస్​ చేయాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Abroad Higher Education Guide - ABROAD HIGHER EDUCATION GUIDE

Abroad Higher Education Guide : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కల చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. అందుకే ఖర్చుకు వెనకాడకుండా చాలా మంది ఉన్నత విద్య కోసం ఫారిన్ వెళ్తుంటారు. అయితే విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో తెలుసుకుందాం.

Abroad Higher Education Guide
Abroad Higher Education Guide (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 3:30 PM IST

Abroad Higher Education Guide : ప్రస్తుత కాలంలో ఉన్నత విద్య కోసం చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు పెరగడం వల్ల, ఈ లక్ష్య సాధనకు కావాల్సిన అన్ని అంశాల్లో పోటీ నెలకొంది. విదేశాల్లో విద్యకు ఖర్చులు భారీగానే అవుతాయి. అయితే, ఈ విదేశీ విద్యకు బయలుదేరడానికి ముందు దీనికి సంబంధించి ప్రక్రియ ఉంటుంది. విదేశీ విద్యార్థులకు మంచి మొత్తంలో ఉపకార వేతనాలు అందించే సంస్థలున్నప్పటికీ, అద్భుతమైన పనితీరు ఉన్న విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిప్స్‌ వస్తాయి. ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులు విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్‌ ప్రక్రియలో వివిధ అవసరాల కోసం ఖర్చులు అవుతాయి. ఈ క్రమంలో వేటికి, ఎలాంటి ఖర్చులుంటాయో ఈ స్టోరీలో చూద్దాం.

అబ్రాడ్‌ స్టడీ కన్సల్టెన్సీ
విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునేటప్పుడు విద్యార్థులు అనేక విదేశీ ఏజెన్సీలను సంప్రదించాలి. ఈ సంస్థలు విద్యార్థులకు విదేశీ విద్య, ఇమిగ్రేషన్‌ ప్రక్రియతో పాటు మరిన్ని విషయాలను తెలియజేస్తాయి. ఈ ఏజెన్సీలు ఉన్నత విద్య కోసం సరైన కోర్సు, విశ్వవిద్యాలయం, దేశాన్ని ఎంచుకోవడానికి విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తాయి. కొన్ని కన్సల్టెంట్స్‌ తమకు టైఅప్‌ అయిన విద్యా సంస్థల నుంచి కమీషన్లు పొందడం వల్ల ఉచితంగా పనిచేసే అవకాశం ఉంది. మరికొన్ని ఏజెన్సీలు విద్యార్థుల నుంచి ఛార్జీలను వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు ఏజెన్సీల పరిధిని బట్టి మారుతుంటాయి.

ఇంగ్లిష్​లో ప్రావీణ్యం
విదేశాల్లోని విద్యా సంస్థలకు దరఖాస్తు చేయడానికి, విద్యాపరంగా ఆంగ్ల భాషా ప్రావీణ్య రుజువు చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని పరీక్షలకు అప్లై చేసుకోవాలి. ఉదాహరణకు IELTS, TOEFL, PTE, SAT పరీక్షలు రాసి ఉత్తీర్ణుతులు అవ్వాలి. ఈ పరీక్షల కోసం దరఖాస్తు ధర వివిధ దేశాల్లో వారి అంగీకార శాతం ఆధారంగా మారవచ్చు. TOEFL, GRE పరీక్ష ఫీజులు భారతీయ కరెన్సీలో రూ. వేలల్లోనే ఉండొచ్చు.

కోర్సు అప్లికేషన్‌
విదేశీ విశ్వవిద్యాలయాల్లో కోర్సు కోసం విద్యార్థులు అప్లై చేసుకోవాలి. విదేశాల్లో అధ్యయనం చేసే ప్రోగ్రామ్​లకు అప్లికేషన్స్‌ ప్రాసెస్‌ చేయడానికి ఛార్జీలు ఉంటాయి. విద్యార్థి అర్హతలను గుర్తించడానికి ఈ దరఖాస్తులో సమాచారం ఆయా కళాశాలలకు ఉపయోగపడుతుంది. ఈ దరఖాస్తుకుగాను ఆయా విద్యాలయాలు ఫీజును వసూలు చేస్తాయి. ఆయా విశ్వవిద్యాలయంలో సీటు వచ్చినా, రాకపోయినా ఈ రుసుం తిరిగి చెల్లించరు. కాబట్టి, మీరు సరైన విచారణ, పరిశోధన తర్వాతే ఏదైనా కోర్సును ఎంచుకోండి. ఉదాహరణకు అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో దరఖాస్తు ధర సుమారు 150 డాలర్లు (రూ.12,500) ఉండొచ్చు. విద్యార్థులు దరఖాస్తు చేస్తున్న కోర్సు/ప్రోగ్రామ్​ను బట్టి ఇది మారుతూ ఉంటుంది. మీరు ఎన్ని విశ్వవిద్యాలయాల్లో దరఖాస్తు చేస్తే అన్ని దరఖాస్తులకు ఫీజును కట్టాల్సి ఉంటుంది.

వీసా దరఖాస్తు
విదేశీ విశ్వవిద్యాలయం నుంచి ఆఫర్‌ లెటర్‌ పొందిన తర్వాత, ఆ దేశానికి వీసా కోసం అప్లై చేయాలి. దీని కోసం వీసా దరఖాస్తు ఫారం, పాస్‌పోర్ట్‌, అడ్మిషన్‌ లెటర్‌, ఆర్థిక పత్రాలతో పాటు ఇతర అవసరమైన పత్రాలను విదేశీ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్​కు సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్యం/తిరస్కరణలను నివారించడానికి విద్యార్థులు ఈ ప్రాసెసింగ్‌ కోసం సరైన సమయానికి సిద్ధం కావాలి. ఈ వీసా దరఖాస్తు కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుం మన దేశ కరెన్సీలో రూ. వేలల్లో ఉంటుంది. అలాగే, ఈ వీసా రుసుములు ఆ దేశానికి ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి మారుతుంటాయి. ఈ రుసుములు 50 డాలర్ల (రూ.4,150) నుంచి 500 డాలర్ల (రూ.41,500) వరకు లేదా అంతకంటే ఎక్కువగాను ఉండొచ్చు. కొన్నిసార్లు వీసా తిరస్కరణకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే, వీసా దరఖాస్తు రుసుం తిరిగి చెల్లించరు. అదనంగా డాక్యుమెంట్స్‌ ప్రాసెసింగ్‌, కొరియర్‌ సేవలు, వీసా దరఖాస్తులకు అవసరమైన వైద్య పరీక్షల కోసం విద్యార్థులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుకునే ప్రతి విద్యార్థికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. వీసా ఆమోదం పొందిన తర్వాత, ఆ దేశంలోని ఆరోగ్య బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి. విదేశంలో చదువుతున్నప్పుడు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలను కవర్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. విదేశంలోని విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యమైన బీమా కంపెనీ నుంచి పాలసీని తీసుకోవచ్చు. లేదా విదేశాల్లో చదువుతున్నప్పుడు విద్యార్థులను కవర్‌ చేసేలా భారతదేశం నుంచి కూడా సొంతంగా బీమా పాలసీ తీసుకోవచ్చు. మెరుగైన ఆరోగ్య రికార్డు ఉన్న విద్యార్థులకు భారతీయ బీమా కంపెనీలు పోటీ రేట్లను ఇస్తాయి. అయితే, అంతర్జాతీయ విద్యార్థులకు నిర్దిష్ట ఆరోగ్య బీమా అవసరాలు ఉంటే విదేశీ విశ్వవిద్యాలయాలు భారతీయ బీమా పాలసీని ఒప్పుకోకపోవచ్చు. చాలా మంది నిపుణులు విశ్వవిద్యాలయం అందించే ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. విదేశాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువగానే ఖర్చు అవుతుంది.

ఫ్లైట్ ఛార్జీలు
ఉన్నత చదువుల కోసం విద్యార్థులు విమానం మీద విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు అయ్యే ప్రయాణ ఖర్చులే ప్రారంభంలో పెట్టే అధిక ఖర్చు. విద్యార్థికి విమాన ఛార్జీలు, విమానాశ్రయ పన్నులు, లగేజీ రుసుములు, ప్రయాణ బీమాతో సహా అయ్యే ఖర్చులు గణనీయమైన ప్రారంభ పెట్టుబడి ఖర్చు కిందకు వస్తాయి. విద్యార్థులు ట్రిప్‌ క్యాన్సిలేషన్లు, పోగొట్టుకున్న సామాను లేదా ప్రయాణంలో వైద్య అత్యవసర పరిస్థితులు వంటి ఊహించని సంఘటనలను కవర్‌ చేయడానికి ప్రయాణ బీమాను తీసుకోవచ్చు.

ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలా? 'నాయకత్వ లక్షణాలు'​ పెంచుకోండిలా! - How To Improve Leadership Skills

ఇంటర్న్‌షిప్‌లోనే 'జాబ్​ స్కిల్స్' నేర్చుకోండి - కాలక్షేపం చేశారో ఇక అంతే! - Benefits Of Doing An Internship

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.