TS Inter Results 2024 : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగిన పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు రాశారు. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం ఇక్కడ https://results.cgg.gov.in క్లిక్ చేయండి. ఫలితాలను ఇక్కడ కూడా results.eenadu.netలో చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చూసుకోండిలా - ap intermediate 2024 results
తెలంగాణ వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 9.81 లక్షల మంది విద్యార్థుల పరీక్ష రాయగా, ఇందులో ప్రథమ సంవత్సరంలో 2.87 లక్షల మంది, ద్వితీయ సంవత్సరంలో 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో 60.01 శాతం, సెకండ్ ఇయర్లో 64.19 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
పదో తరగతి ఫలితాలు విడుదల - చెక్ చేసుకోండిలా - AP SSC RESULTS 2024 RELEASED
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 68.35 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 72.53 శాతం మంది అమ్మాయిలు పాస్ అయ్యారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 51.5 శాతం బాలురు పాస్ అవ్వగా, సెకండియర్లో 56.1 శాతం ఉత్తీర్ణఉలయ్యారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. మేడ్చల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా విద్యార్థులు టాప్ చేయగా, రెండో స్థానంలో మేడ్చల్ జిల్లా నిలిచింది.
599/600 - టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన మనస్వీ - AP SSC Toppers Inspiring Stories