ETV Bharat / education-and-career

టీఎస్‌ ఈసెట్‌ ఫలితాలు విడుదల - ఒక్క క్లిక్‌ చేసి మీ ర్యాంక్‌ తెలుసుకోండి - Telangana E CET Results 2024 - TELANGANA E CET RESULTS 2024

Telangana E CET Results 2024 Released : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో టీఎస్‌ ఈసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఫలితాల జాబితాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి విడుదల చేశారు. పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు మొత్తం 25,288 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూన్ రెండో వారం నుంచి అడ్మిషన్ షెడ్యూల్ ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు.

Telangana E CET Results 2024 Released
Telangana E CET Results 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 20, 2024, 5:33 PM IST

Telangana E CET Results 2024 Released : తెలంగాణ 2024- 25 ఏడాదికి సంబంధించి టీఎస్ ఈ సెట్‌ ఫలితాలు విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు 23,306 మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు అర్హత సాధించారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు. విజేతలైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు 10,534 సీట్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

TS E CET Result Link : గత సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో ఖాళీగా మిగిలిన సీట్లు ప్రస్తుతం విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ఆచార్య లింబాద్రి తెలిపారు. వాటితో కలిపితే మొత్తం 25,288 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కన్వీనర్ కోటాలో 10,734 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. మేడ్చల్‌ మల్గాజిగిరికి చెందిన విద్యార్థికి మొదటి ర్యాంక్‌ వచ్చిందని తెలిపారు.

TS E CET Qualify Students 2024 : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో టీఎస్ ఈ సెట్‌ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా మే 6న 99 కేంద్రాల్లో నిర్వహించారు. విద్యార్థులు ఫలితాల కోసం https://ecet.tsche.ac.in/ లింక్‌పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల ర్యాంక్‌ కార్డులను పొందుపరిచామని అన్నారు. జూన్ రెండో వారం నుంచి అడ్మిషన్ షెడ్యూల్ ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీ ఫార్మసీ సెంకడియర్‌లో ప్రవేశించేందుకు ఈ పరీక్ష ద్వారా అవకాశం ఉంటుంది.

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల - ఇంజినీరింగ్‌ ర్యాంకుల్లో బాలుర సత్తా - TS EAPCET Results 2024

"ఈ సంవత్సరం 11 బ్రాంచ్‌లకు సంబంధించి ఈ సెట్‌ పరీక్ష నిర్వహించాం. ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో మేడ్చల్‌ మల్గాజిగిరి జిల్లాకు చెందిన సాయి అనే విద్యార్థికి మొదటి ర్యాంక్‌ వచ్చింది. రెండో ర్యాంక్‌ హైదాబాద్‌లోని సుభాశ్‌ నగర్‌కి చెందిన సాయి విగ్నేష్‌కి వచ్చింది. మూడు, నాలుగు ర్యాంకులు వరంగల్‌ జిల్లా విద్యార్థులు సాధించుకున్నారు. వారందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను." - ఆచార్య లింబాద్రి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్

టీఎస్‌ ఈ సెట్‌ ఫలితాలు విడుదలు ఒక్క క్లిక్‌ చేసి మీ ర్యాంక్‌ తెలుసుకోండి (ETV Bharat)

CBSE 10, 12వ తరగతి ఫలితాలు విడుదల- మళ్లీ అమ్మాయిలే టాప్​ - CBSE Class 12 results

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.