Study Tips For Exams Preparation : కొందరు విద్యార్థులు పరీక్షలు ఎంత బాగా రాసినా మార్కులు మాత్రం ఊహించిన దాని కంటే తక్కువే వస్తున్నాయి. సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా చదివినా ఫలితం దక్కడంలేదని వాపోతుంటారు. మరి, ముఖ్యంగా పరీక్షల టైమ్‌లో చాలా మంది విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోరు, తగినంత నిద్ర పోరు. అలాగే ఒత్తిడి, ఆందోళనల కారణంగా వివిధ ఆరోగ్య సమస్యల బారినపడుతుంటారు. అలాంటి జాబితాలో మీరూ ఉన్నారా? అయితే, ఈ టిప్స్ పాటించారంటే.. ఇకపై మీరు ఆరోగ్య సమస్యల బారినపడకుండా ఉండడమే కాదు.. పరీక్షల్లో(Exams) మంచి మార్కులు సాధిస్తారంటున్నారు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ స్వాతి పైడిపాటి. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- ఎవరైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, అంకితభావంతో చదివితే మంచి మార్కులు తప్పక వస్తాయంటున్నారు డాక్టర్ స్వాతి పైడిపాటి. అంతేకానీ.. ఎక్కువ మార్కులు రావాలని తిండి, నిద్ర మానేయడం మంచి పని కాదంటున్నారు.
- అలాగే.. ‘స్మార్ట్ వర్క్’ చేయాలి. వారానికి, నెలకి ఇన్ని ఛాప్టర్లు చదవాలి అని పెట్టుకుని చదివితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకానీ.. ఏకధాటిగా చదువుతూ పోతే ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. అదేవిధంగా.. ఎన్ని గంటలపాటు చదివారు అనే దానికంటే ఎంత ఏకాగ్రతతో చదివారనేదే ముఖ్యమంటున్నారు.
- మీకు పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే.. ముందుగా ఏ సబ్జెక్టు లేదా పాఠంలో మార్కులు తగ్గుతున్నాయో చెక్ చేసుకోవాలి. వాటిని మిగతా వాటికంటే రెండు మూడుసార్లు ఎక్కువగా చదువుకోవాలంటున్నారు.
ఎంత చదివినా.. గుర్తుండటం లేదా?
- అలాగే.. ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేసుకోవడం, చిన్న చిన్న నోట్లు రాసుకుని ఎదురుగా పెట్టుకోవడం చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా.. కీవర్డ్స్ రాసుకోవడం, మైండ్ మ్యాపింగ్ వంటి మెమరీ టెక్నిక్స్‌నీ ప్రయత్నించాలంటున్నారు. ఇవన్నీ చదివినవి మెదడులో నిక్షిప్తం అయ్యేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు డాక్టర్ స్వాతి.
- చదివినవి ఎంత వరకూ అర్థమయ్యాయో తెలుసుకునేందుకు.. ప్రశ్నలు వేసుకోవడం, సమీక్షించుకోవడం, అవసరమైతే మరోసారి చదవడం వంటి టిప్స్ పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి యూజ్ అవుతాయంటున్నారు. అర్థం కానివి ఉంటే స్నేహితులతో చర్చించుకోవాలంటున్నారు.
- అలాగే.. ముందుగా ఏ సబ్జెక్టుకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది టైమ్‌టేబుల్ వేసుకోవాలి. దాన్ని కచ్చితంగా అమలు చేయడానికీ ప్రయత్నిస్తే గుడ్ రిజల్ట్ ఉంటుందంటున్నారు.
- ముఖ్యంగా మీరు ఎలాంటి పరీక్ష రాస్తున్నా.. ఎగ్జామ్ ఎలా రాస్తానో అన్న అనవసర కంగారు మాని ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అలాగే.. అనవసర ఒత్తిడి లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
- వీటన్నింటితో పాటు మీరు డైలీ ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. వీటితోనూ మెమరీ పెరుగుతుందంటున్నారు. మీరు ఇకపై ఈ టిప్స్ పాటించి చూడండి... ఆరోగ్యంగానూ ఉంటారు, పరీక్షల్లో చక్కని ఫలితాలూ పొందుతారని సూచిస్తున్నారు డాక్టర్ స్వాతి పైడిపాటి.
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!