ETV Bharat / education-and-career

సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఉద్యోగమే మీ లక్ష్యమా? ఈ ఇంటర్వ్యూ టిప్స్ మీ కోసమే! - Software Engineering Interview Tips

Software Engineering Interview Questions : మీరు సాఫ్ట్​వేర్ ఇంజినీరింగ్ ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగి అవకాశం ఉంది? వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? మొత్తంగా ఇంటర్వ్యూలో సక్సెస్ కావడం ఎలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Software Engineering Interview Questions and Answers
Software Engineering Interview Questions
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 10:12 AM IST

Software Engineering Interview Questions : ప్రస్తుత కాలంలో చాలా మంది యువతీయువకులు సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారీ జీతాలు, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తుండడమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి కంపెనీలో సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాలంటే, ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఉద్యోగాన్ని ఒడిసిపట్టుకోగలుగుతారు. అందుకే ఈ ఆర్టికల్​లో సాఫ్ట్​వేర్ ఉద్యోగం సాధించాలంటే ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. డేటా స్ట్రక్చర్​ అండ్​ ఆల్గారిథమ్స్​ : కోడింగ్​కు వెన్నెముకగా డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్ పనిచేస్తాయి. అందుకే ఇంటర్వ్యూ చేసేవారు డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్‌లపై మిమ్నల్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉంది.

2. ప్రోబ్లమ్ సాల్వింగ్​ : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఉండాలి. అందువల్ల ఇంటర్వ్యూ చేసేవారు కొన్ని దృశ్యాలను ప్రదర్శించి, వాటికి మీరు కోడ్​ను ఉపయోగించి సొల్యూషన్స్ కనుక్కొవాలని అడుగుతారు. మీరు సమస్యను చిన్న చిన్నభాగాలు విడదీసి, వాటికి కోడింగ్ రాయగలగాలి. చాలా క్లారిటీతో, ఎఫీషియెన్సీతో కోడింగ్ రాసి, సరైన పరిష్కారం చూపించగలగాలి. ఈ విధంగా మీ కోడింగ్​ స్కిల్స్​తో ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకోవాలి.

3. టెక్నికల్ ప్రొఫీషియెన్సీ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, డెవలప్‌మెంట్ టూల్స్‌లో ప్రావీణ్యం అవసరం. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్స్ (IDE), వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, డీబగ్గింగ్ యుటిలిటీస్ వంటి టూల్స్​పై మంచి పట్టు సాధించండి. మీరు ఎంచుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్​లో మంచి పట్టు కలిగి ఉండండి. డెవలప్‌మెంట్ టూల్స్ ఉపయోగించడంలో మీరు చూపే ప్రతిభ ఇంటర్వ్యూ చేసేవారికి మీపై సానుకూల దృక్పథం ఏర్పడేలా చేస్తుంది.

4. సిస్టమ్ డిజైన్ : స్కేలబుల్, రిలయబుల్, మెయింటెనబుల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లను వాడినప్పుడు మీ సామర్థ్యాన్ని ఇంటర్వ్యూయర్‌లు అంచనా వేస్తారు. అందుకే సిస్టమ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ డిజైన్, స్కేలబిలిటీ, కాన్కరెన్సీ, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ వంటి అంశాలపై బాగా ప్రిపేర్ కావాలి.

5. సాఫ్ట్ స్కిల్స్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌ ఉద్యోగం సాధించడానికి సాఫ్ట్ స్కిల్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ చేసేవారు మీ ఆలోచనలను సమర్థంగా కమ్యూనికేట్ చేయగలగుతున్నారా? లేదా? అనేది కూడా చూస్తారు.

HR క్వశ్చన్స్ & ఆన్సర్స్​ : సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగార్థులు హ్యూమన్​ రిసోర్సెస్​​ డిపార్ట్​మెంట్​ (హెచ్​ఆర్​) ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెల్స్( సెల్ఫ్), బ్యాగ్రౌండ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అడుగుతారు. మీరు సదరు కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలను అడుగుతారు. సదరు కంపెనీ గురించి మీకు ఏమి తెలుసు అని కూడా అడిగే అవకాశం కూడా ఉంది. మీ బలాలు- బలహీనతలపై ప్రశ్నలు వేస్తారు. అప్పుడు మీ బలాలను మాత్రమే హెచ్​ఆర్​కు తెలియజేయండి. కంపెనీ విజయానికి మీరు ఎలా దోహదపడతారు? వంటి ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పండి. ఈ విధంగా చేసే మీకు ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్​ ది బెస్ట్!

పోటీ పరీక్షలు రాస్తున్నారా? ఈ 5 టిప్స్​ పాటిస్తే విజయం పక్కా! - Competitive Exam Success Tips

SSC భారీ నోటిఫికేషన్​ - ఇంటర్​ అర్హతతో 3712 పోస్టులు భర్తీ! - SSC Jobs 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.