ETV Bharat / education-and-career

కేంద్రం కొత్త స్కీమ్​ - నెలకు రూ.5వేలు స్టైఫండ్ - టాప్‌ కంపెనీల్లో ఇంటర్న్​షిప్​! - PM INTERNSHIP SCHEME 2024

యువత కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్​ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా నెలకు రూ.5,000 చెల్లించనుంది. ఈ ఫథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

PM Internship Scheme
PM Internship Scheme 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 4:59 PM IST

PM Internship Scheme 2024 : యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని (PM Internship Scheme) ప్రారంభించింది. ఈ స్కీమ్​కు ఎంపికైన అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఏడాదిపాటు ఇంటర్న్​షిప్ కల్పిస్తారు. దీంతో పాటు వన్ టైమ్ గ్రాంట్ కింద రూ. 6,000 ఇంకా నెలకు రూ.5,000 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. ఈ నేపథ్యంలోనే దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు? ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు? అనే వివరాలను ​ఏఐసీటీఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ 'డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్' వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..

ప్రధానమంత్రి ఇంటర్న్​షిప్​ స్కీమ్ లక్ష్యం ఏమిటి?

జవాబు: దేశంలోని టాప్​ 500 కంపెనీల్లో కోటి మంది నిరుద్యోగ యువతకి ఉపాది నైపుణ్యాలను కల్పించడం.

ప్రధానమంత్రి ఇంటర్న్​షిప్​ స్కీమ్​ అప్లై చేయడానికి ఎవరు అర్హులు ?

జవాబు: 21-24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి భారతీయుడు ఈ స్కీమ్​కు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు SSC, HSC, ఐటీఐ, పాలిటెక్నిక్​ లేదా B.Sc, B.Com, BCA, BBA లేదా బీఫార్మసీ వంటి గ్రాడ్యుయేషన్​ డిగ్రీలు పూర్తి చేసి ఉండాలి.

ఇంటర్న్​షిప్​ స్కీమ్​ అప్లై చేయడానికి ఎవరు అనర్హులు ?

జవాబు: MBA, MBBS, Phd, సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి అర్హతలు కలిగినవారు అనర్హులు. ఇంకా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన వారు కూడా అనర్హులు. ఎటువంటి పర్మనెంట్ ఉద్యోగం చేస్తుండకూడదు. ఈ స్కీమ్​కు అప్లై చేసుకునే వారి వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు. అలాగే ఫ్యామిలీలో ఎవరికీ కూడా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. అలాగే ఇంకా ఏదైనా కోర్సు చదువుతున్నవారు కూడా అప్లై చేయడానికి అనర్హులు.

ఈ స్కీమ్​లో చేరడానికి ఏవైనా రిజర్వేషన్ నిబంధనలు ఉన్నాయా ?

జవాబు: ఎలాంటి రిజర్వేషన్లు లేవు. కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఈ పథకానికి ఎవరైనా విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చా ?

జవాబు: లేదు. ఈ స్కీమ్​కు విదేశీయులు అప్లై చేసుకోడానికి అనర్హులు. కేవలం ఈ పథకం భారతీయుల కోసమే.

ఇంటర్న్​షిప్ ​కోసం అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు ?

జవాబు: అభ్యర్థులు ముందుగా పీఎం ఇంటర్న్​షిప్​ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వారి వివరాలను నమోదు చేయాలి. వారి అర్హతలకు అనుగుణంగా వివిధ కంపెనీల్లో ఇంటర్న్​షిప్ కోర్సులు​ చేయడానికి నమోదు చేసుకోవాలి. తర్వాత కంపెనీలు అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి సెలెక్ట్​ చేస్తాయి.

ఇంటర్న్​షిప్​ ఎన్ని రోజులు ఉంటుంది?

జవాబు: స్కీమ్​కు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు ఇంటర్న్​షిప్​ ఉంటుంది.

అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం ?

జవాబు: ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటో అవసరం. రిజిస్ట్రేషన్​ సమయంలో ఇతర డాక్యుమెంట్లు ఏమి అవసరం లేదు.

అభ్యర్థి ఎన్ని ఇంటర్న్​షిప్​ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు ?

జవాబు: అభ్యర్థుల విద్యా అర్హతల ఆధారంగా 5 ఇంటర్న్​షిప్​ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. అయితే, మీరు అప్లికేషన్​ సబ్మిట్​ చేసే ముందు ఐదు ప్రాధాన్యతలను ఎన్ని సార్లైనా మార్చుకోవచ్చు. ఒక్కసారి సబ్మిట్​ చేసిన తర్వాత ఎలాంటి మార్పుల చేసుకోవడానికి వీలుండదు.

ప్రశ్న: అభ్యర్థులకు నచ్చిన ఐదు ఇంటర్న్​షిప్​ కోర్సుల్లో దేనికీ సెలక్ట్​ కాకపోతే.. మళ్లీ అప్లై చేసుకోవచ్చా ?

జవాబు: అవును. అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రశ్న: గరిష్ఠంగా ఒక అభ్యర్థికి ఎన్ని ఇంటర్న్​షిప్​ ఆఫర్లు వస్తాయి ?

జవాబు: అభ్యర్థికి రెండు ఇంటర్న్​షిప్​ ఆఫర్లు వస్తాయి. షార్ట్​లిస్ట్ అయిన వారి ఆఫర్ లెటర్ పీఎం ఇంటర్న్​షిప్ పోర్టల్లో అప్​లోడ్ చేస్తారు. అలాగే ఈమెయిల్​ ద్వారా మెసేజ్​ వస్తుంది. ఎంపికైనవారికి ప్రతినెలకు రూ.5000 ఆర్థిక సహాయం అందిస్తారు. దీనికి అదనంగా అభ్యర్థులు చేరిన తర్వాత రూ.6000 వన్ టైమ్​ గ్రాంట్ ఇస్తారు. అభ్యర్థి ఆధార్​ కార్డ్​కు లింక్​ చేసిన బ్యాంక్​ అకౌంట్​లో ఈ డబ్బులు జమ అవుతాయి. ఈ ఇంటర్న్​షిప్​ కాలంలో అభ్యర్థులకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీ ఉంటుంది.

ప్రశ్న: ఇంటర్న్​షిప్​ ద్వారా ఏ రంగాలలో నైపుణ్యాలను అందిస్తారు ?

జవాబు: ఐటీ అండ్ సాఫ్ట్​వేర్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్, గ్యాస్ అండ్ ఎనర్జీ, మెటల్స్ అండ్ మైనింగ్, ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్), టెలికాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్​స్ట్రక్షన్, రిటైల్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, ఆటో మోటివ్, ఫార్మాస్యూటికల్, ఏవియేషన్ అండ్ డిఫెన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియస్ట్రిల్, కెమికల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో ఇంటర్న్​షిప్​ లభిస్తాయి. అగ్రికల్చర్ అండ్ అలైడ్, కన్సల్టింగ్ సర్వీసెస్, టెక్స్​టైల్​ మాన్యుఫ్యాక్చరింగ్, జెమ్స్అండ్ జువెలరీ, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, హెల్త్​ కేర్. ఇంటర్న్​షిప్​ సమయంలో 6 నెలలు శిక్షణ తరగతులు, 6 నెలలు ప్రాక్టికల్​ ట్రైనింగ్ ఉంటుంది.

ప్రశ్న: ఇంటర్న్​షిప్​ పూర్తైన తర్వాత ఉద్యోగం వస్తుందా ?

జవాబు: ఇంటర్న్​షిప్​ పూర్తి చేస్తే ఉద్యోగం గ్యారంటీ అని ఉండదు. కానీ, ఇంటర్న్​షిప్​ ద్వారా అభ్యర్థుల చాలా నైపుణ్యాలను సంపాదించుకుంటారు. దీనివల్ల వివిధ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

ప్రశ్న: యువతకి నైపుణ్యాలను అందించడానికి ఈ స్కీమ్​ ప్లాన్ ఏంటి ?

జవాబు: వచ్చే రెండేళ్లలో 30 లక్షల మందికి నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత ఐదేళ్లలో మొత్తం కోటి మంది యువతకు నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ప్రధాన మంత్రి ఇంటర్న్​షిప్ స్కీమ్ పోర్టల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

జవాబు: 2024 అక్టోబర్​ 12వ తేదీన అఫీషియల్​గా ఈ పోర్టల్​ ఓపెన్​ అవుతుంది. అభ్యర్థులు రిజిస్టర్​ చేసుకుని స్కీమ్​కు అప్లై చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :

ఇంటర్న్‌షిప్‌లోనే 'జాబ్​ స్కిల్స్' నేర్చుకోండి - కాలక్షేపం చేశారో ఇక అంతే!

ఇంటర్​, డిగ్రీ అర్హతతో - రైల్వేలో 11,558 పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.