PGCIL Trainee recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 795 ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రీజియన్లవారీగా పోస్టుల వివరాలు
- సీసీ - 50 పోస్టులు
- ఈఆర్ 1 - 33 పోస్టులు
- ఈఆర్ 2 - 29 పోస్టులు
- ఒడిశా - 32 పోస్టులు
- ఎన్‌ఈఆర్ - 47 పోస్టులు
- ఎన్‌ఆర్ 1 - 84 పోస్టులు
- ఎన్‌ఆర్ 2 - 72 పోస్టులు
- ఎన్‌ఆర్ 3 - 77 పోస్టులు
- ఎస్‌ఆర్ 1 - 71 పోస్టులు
- ఎస్‌ఆర్ 2 - 112 పోస్టులు
- డబ్ల్యూఆర్ 1 - 75 పోస్టులు
- డబ్ల్యూఆర్ 2- 113 పోస్టులు
- మొత్తం పోస్టులు - 795
దరఖాస్తు రుసుము
- డీటీఈ/ డీటీసీ/ జేఓటీ (హెచ్‌ఆర్)/ జేఓటీ (ఎఫ్&ఏ) పోస్టులకు రూ.300 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.
- అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్&ఏ) పోస్టులకు దరఖాస్తు రుసుముగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
- ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎలిజిబిలిటీ
విద్యార్హతలు, వయోపరిమితి వివరాల కోసం పీజీసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నోటిఫికేషన్ చూడండి.
ఎంపిక విధానం
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ పెడతారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అర్హులైన అభ్యర్థులను ట్రైనీ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- కెరీర్స్ సెక్షన్‌లోకి వెళ్లి అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 అక్టోబర్ 22
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 నవంబర్ 12