ETV Bharat / education-and-career

ప్రభుత్వ రంగ బీమా సంస్థ NIACLలో 300 అసిస్టెంట్​ పోస్టులు - దరఖాస్తు చేయండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 10:27 AM IST

NIACL Assistant Recruitment 2024 In Telugu : డిగ్రీలు చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. న్యూ ఇండియా అస్యూరెన్స్​ కో.లిమిటెడ్​ 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

NIACL Assistant jobs 2024
NIACL Assistant Recruitment 2024

NIACL Assistant Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కో.లిమిటెడ్ 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు ఫిబ్రవరి 1 నుంచి స్వీకరించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హతలు
NIACL Assistant Qualifications : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి ఉండాలి. అలాగే వారికి తమ రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన స్థానిక భాషలు కచ్చితంగా తెలిసి ఉండాలి.

వయోపరిమితి
NIACL Assistant Age Limit : అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 21 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు
NIACL Assistant Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
NIACL Assistant Selection Process : అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి రీజినల్​ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. దీనిలో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులను అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
NIACL Assistant Salary అసిస్టెంట్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,405 నుంచి రూ.62,265 వరకు వేతనం ఉంటుంది.

దరఖాస్తు విధానం
NIACL Assistant Application Process :

  • అభ్యర్థులు ముందుగా న్యూ ఇండియా అస్యూరెన్స్​ కో.లిమిటెడ్​కు సంబంధించిన అధికారిక వెబ్​సైట్ https://www.newindia.co.in/ ఓపెన్ చేయాలి.
  • హోమ్​ పేజ్​లోని రిక్రూట్​మెంట్​ ట్యాబ్​పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
  • అసిస్టెంట్​ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్​ ఫారమ్​ను ఓపెన్​ చేయాలి.
  • అప్లికేషన్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్​ చేసుకుని దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
NIACL Assistant Job Apply Last Date :

  • దరఖాస్తులు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 1
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 15
  • ప్రిలిమినరీ పరీక్ష : 2024 మార్చి 3

దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

నేషనల్​ డిఫెన్స్​ అకాడమీలో 198 గ్రూప్​-సీ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.