NALCO Engineering Jobs 2024 : నవరత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్' (NALCO) 277 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని భువనేశ్వర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- యూఆర్ - 116 పోస్టులు
- ఓబీసీ - 72 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 27 పోస్టులు
- దివ్యాంగులు - 15 పోస్టులు
- ఎస్టీ - 18 పోస్టులు
- ఎస్సీ - 44 పోస్టులు
- మొత్తం పోస్టులు - 277
విద్యార్హతలు
NALCO Graduate Engineer Qualifications : అభ్యర్థులు 65 శాతం మార్కులతో (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ) విభాగాల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. కెమిస్ట్రీ పోస్టులకు ఎంఎస్సీ (కెమిస్ట్రీ) పాస్ అయ్యుండాలి. వీటితో పాటు గేట్-2023 మార్కులు కూడా ఉండాలి.
వయోపరిమితి
NALCO Graduate Engineer Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్ 2 నాటికి 30 ఏళ్లు మించి ఉండకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
NALCO Graduate Engineer Fees : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ
NALCO Graduate Engineer Selection Process : ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ -2023లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి, అర్హులైన వారిని గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
NALCO Graduate Engineer Salary : గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం అందిస్తారు.
దరఖాస్తు విధానం
NALCO Graduate Engineer Application Process :
- ముందుగా మీరు నాల్కో అధికారిక వెబ్సైట్ https://nalcoindia.com/ ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్లో మీ వివరాలు నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్పుడు మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది.
- ఈ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
- కెరీర్స్ సెక్షన్లోకి వెళ్లి Apply Now లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
NALCO Recruitment Apply Last Date :
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 4
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 ఏప్రిల్ 2
SSC భారీ నోటిఫికేషన్ - 2049 పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 517 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!