ETV Bharat / education-and-career

కృత్రిమ మేధ (AI) ఎంత డెవలప్ అయినా - ఈ జాబ్స్​ మాత్రం సేఫ్​! - Jobs That Are Safe From AI - JOBS THAT ARE SAFE FROM AI

Jobs That Are Safe From AI : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఉద్యోగులకు ముప్పు తప్పదని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని జాబ్స్​ను ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదని నిపుణులు చెబుతున్నారు. ఆ ఉద్యోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Jobs That Are Safe From AI
Jobs Safe From AI
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 10:51 AM IST

Jobs That Are Safe From AI : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల పలు రంగాల్లో భారీ స్థాయిల్లో ఉద్యోగాలు పోతాయని వార్తలు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ వినియోగం పెరిగడం వల్ల నిరుద్యోగులు ఎక్కువైపోతారని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏఐ టెక్నాలజీ ఎంత పెరిగినా, కొన్ని రంగాలకు చెందిన ఉద్యోగులకు ఏ మాత్రం భయంలేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఉద్యోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. ఆరోగ్య సంరక్షణ నిపుణులు (హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్)
వైద్యులు, నర్సులు, థెరపిస్ట్‌లు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయలేదు. కనుక ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ జాబ్​లకు ఏఐతో ఎటువంటి ప్రమాదం ఉండదు.

2. సృజనాత్మక వృత్తులు (క్రియేటివ్ ప్రొఫెషన్స్​)
రచయితలు, కళాకారులు, సంగీతకారులు, డిజైనర్లకు ప్రత్యేకమైన సృజనాత్మకత, కళాత్మకత ఉంటుంది. వీటిని కృత్రిమ మేధ చేయలేదు. కనుక సృజనాత్మక వృత్తినిపుణులకు ఎలాంటి ఢోకా ఉండదు.

3. మానసిక ఆరోగ్య నిపుణులు (మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్)
మనస్తత్వవేత్తలు, సలహాదారులు (కౌన్సిలర్లు), సామాజిక కార్యకర్తలు - వ్యక్తుల భావోద్వేగాలను, మానసిక పరిస్థితులను అర్థం చేసుకుని, వారికి తగిన ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. వీటిని ఏఐ చేయలేదు. కనుక ఈ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్​పై ఏఐ ప్రభావం పడదు.

4. హెచ్​ఆర్ నిపుణులు
హెచ్‌ఆర్ నిపుణులు ఉద్యోగుల రిక్రూట్‌మెంట్, వారి సాలరీలు నిర్ణయించడం సహా కంపెనీ బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. భిన్నమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. ఉద్యోగుల భావోద్వేగాలను, సంఘర్షణలను అర్థం చేసుకుని, పరిష్కారం చూపగలుగుతారు. వీటిని కృత్రిమ మేధ చేయలేదు. కనకు హెచ్​ఆర్​ నిపుణులు సేఫ్​!

5. స్కిల్డ్​ ట్రేడ్స్​
మన నిత్య జీవితంలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, మెకానిక్​ల అవసరం ఎంతో ఉంటుంది. ఏఐ ఉపయోగించి ఈ పనులు చేయలేము. కనుక మంచి నైపుణ్యమున్న వృత్తి నిపుణులకు ఏఐతో ఎలాంచి ముప్పు ఉండదు.

6. ఉపాధ్యాయులు, అధ్యాపకులు
అధ్యాపకులు విద్యార్థులకు పాఠాలు భోదించడం మాత్రమే కాదు, వారి జీవితానికి మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. కృత్రిమ మేధ ఈ పని చేయలేదు. కనుక టీచింగ్ ప్రొఫెషనల్​లో ఉన్నవారికి ఏఐతో ఎలాంటి ముప్పు లేదని చెప్పవచ్చు.

7. కౌన్సిలర్స్, థెరపిస్టులు
కెరీర్ కౌన్సిలర్లు, లైఫ్ కోచ్‌లు, థెరపిస్ట్‌లు వ్యక్తులకు కెరీర్ గురించి మార్గదర్శకత్వం చేస్తారు. అలాగే వ్యక్తుల భావోద్వేగాలను అర్థం చేసుకుని, వారికి తగిన సలహాలు ఇస్తారు.

8. రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్
శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్లు నిత్యం పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు చేసే పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇందుకోసం చాలా విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత, ధృఢమైన మనస్తత్వం ఉండాలి. ఇవేవీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​కు ఉండవు. కనుక శాస్త్రవేత్తలను ఏఐ ఎన్నటికీ రీప్లేస్ చేయలేదు.

9. అత్యవసర సేవలు
అగ్నిమాపక సిబ్బంది, పారామెడిక్స్, పోలీస్​లు తక్షణమే స్పందిస్తారు. ఎలాంటి విపత్తు వచ్చినా తమ శక్తి మేరకు వాటిని ఆపే ప్రయత్నం చేస్తారు. సమయానుకూలంగా వ్యవహరించి, ప్రజలను రక్షిస్తారు. ఇలాంటి పనులు ఏఐ చేయదు. కనుక ఈ ఉద్యోగాలు కూడా సేఫ్.

10. సేల్స్ అండ్ మార్కెటింగ్
సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలు పబ్లిక్​తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. మనుషులను ఆకట్టుకునే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వీరిలో ఉంటాయి. ఇది కూడా ఏఐతో సాధ్యం కాదు. కనుక సేల్స్ అండ్ మార్కెటింగ్ నిపుణులకు కూడా నో ప్రోబ్లమ్.

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? రెజ్యూమ్​లో ఆ తప్పులు చేశారో - ఇక అంతే! - How To Make The Perfect Resume

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.