IBPS Recruitment 2024 : నిరుద్యోగ యువతకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 9,995 గ్రూప్-ఏ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ఎంపికైన వారు రీజనల్ రూరల్ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో పని చేయాల్సి ఉంటుంది.
ఐబీపీఎస్ జూన్ 6న ఆర్‌ఆర్‌బీ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XIII నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లోని ఆఫీసర్(స్కేల్-1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు :
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) : 5,585 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-I : 3499 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్) : 70 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (లా) : 30 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (సీఏ) : 60 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (ఐటీ) : 94 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) : 496 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్) : 11 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్) : 21 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-III : 129 పోస్టులు
- మొత్తం ఉద్యోగాల సంఖ్య : 9,995.
విద్యార్హతలు
IBPS RRB Job Qualifications : పోస్టులను అనుసరించి అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి తీరాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయస్సు
IBPS RRB Job Age Limit :
- ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్లు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము :
IBPS RRB Job Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి.
- దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం
IBPS RRB Selection Process : అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్‌కు సెలక్ట్ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
- అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్‌సైట్: https://www.ibps.in/
ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు ఇవే!
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, విదర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంక్ మొదలైనవి.
ఏపీలోని ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు/ విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి.
తెలంగాణాల్లోని ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం
తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు/ విజయవాడ, నెల్లూరు, కడప, కర్నూలు, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్.
ముఖ్యమైన తేదీలు
- ఐబీపీఎస్ దరఖాస్తు ప్రారంభం : 2024 జూన్ 7
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 27
- ప్రిలిమినరీ పరీక్ష : 2024 ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీలు
- ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి : 2024 ఆగస్టు/ సెప్టెంబర్
- మెయిన్స్ పరీక్ష తేదీ : 2024 సెప్టెంబర్/ అక్టోబర్
- మెయిన్స్ ఫలితాల వెల్లడి (ఆఫీసర్ స్కేల్ 1, 2, 3) : 2024 అక్టోబర్
- ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3) : 2024 నవంబర్
- ప్రొవిజనల్ అలాట్‌మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)) : 2025 జనవరి
గూగుల్ బంపర్ ఆఫర్ - ఉచితంగా AI కోర్సులు - నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ! - Google AI Courses For Free
ఫ్రీలాన్సర్‌గా పని చేయాలా? ఈ టాప్-10 వెబ్‌సైట్స్‌పై ఓ లుక్కేయండి! - Best Freelancing Sites