IB Recruitment 2024 : ఇంటెలిజెన్స్ బ్యూరో 660 గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఏసీఐఓ-I/Exe - 80 పోస్టులు
- ఏసీఐఓ-II/Exe - 136 పోస్టులు
- ఏసీఐఓ-II/సివిల్ వర్క్స్ - 3 పోస్టులు
- జేఐఓ-I/Exe - 120 పోస్టులు
- జేఐఓ-II/Exe - 170 పోస్టులు
- జేఐఓ-II/టెక్ - 8 పోస్టులు
- జేఐఓ-I/ఎంటీ - 22 పోస్టులు
- ఎస్ఏ/Exe - 100 పోస్టులు
- హల్వాయ్-కమ్-కుక్ - 10 పోస్టులు
- కేర్ టేకర్ - 5 పోస్టులు
- పీఏ - 5 పోస్టులు
- ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్ - 1 పోస్ట్
- మొత్తం పోస్టులు - 660
విద్యార్హతల వివరాలు
అభ్యర్థుల విద్యార్హతలు పోస్టులను బట్టి మారుతూ ఉంటాయి. కనుక పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
అభ్యర్థుల కనిష్ఠ వయస్సు గురించి నోటిఫికేషన్లో పేర్కొనలేదు. కానీ గరిష్ఠ వయస్సు 56 ఏళ్లలోపు ఉండాలి.
జీత భత్యాలు
- ఏసీఐఓ-I/Exe - రూ.47,600 - రూ.1,51,100
- ఏసీఐఓ-II/Exe - రూ.44,900 - రూ.1,42,400
- ఏసీఐఓ-II/సివిల్ వర్క్స్ - రూ.44,900 - రూ.1,42,400
- జేఐఓ-I/Exe - రూ.29,200 - రూ.92,300
- జేఐఓ-II/Exe - రూ.25,500 - రూ.81,100
- జేఐఓ-II/టెక్ - రూ.25,500 - రూ.81,100
- జేఐఓ-I/ఎంటీ - రూ.29,200 - రూ.92,300
- ఎస్ఏ/Exe - రూ.21,700 - రూ.69,100
- హల్వాయ్-కమ్-కుక్ - రూ.21,700 - రూ.69,100
- కేర్ టేకర్ - రూ.29,200 - రూ.92,300
- పీఏ - రూ.44,900 - రూ.1,42,400
- ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్ - రూ.19,900 - రూ.63,200
ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి?
- స్టెప్ 1: అధికారిక వెబ్సైట్ https://www.mha.gov.in/en ను ఓపెన్ చేయాలి
- స్టెప్ 2: పోర్టల్‌లోని కెరీర్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి
- స్టెప్ 3: ఐబీ నోటిఫికేషన్ 2024ను ఓపెన్ చేయాలి.
- స్టెప్ 4: నోటిఫికేషన్లో పొందుపరిచిన వివరాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలి.
- స్టెప్ 5: విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు లాంటి అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
- స్టెప్ 6: దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- స్టెప్ 7: అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- స్టెప్ 8: దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- స్టెప్ 9: అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ రిలీజ్ డేట్ : 2024 మార్చి 30
- దరఖాస్తుకు చివరి తేదీ : అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.