ETV Bharat / education-and-career

ఏడాదికి రూ.70 లక్షల వరకు శాలరీ- ఇండియాలో హైయెస్ట్​ పేయింగ్​ జాబ్స్ ఇవే!​ - Highest Paying Jobs In India

Highest Paying Jobs In India : మీరు భారీగా జీతం వచ్చే ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం భారత్​లో ఏడాదికి రూ.70 లక్షల వరకు జీతం అందిస్తున్న టాప్​-5 జాబ్​ ఆప్షన్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Highest Paying Jobs In India
Highest Paying Jobs In India (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 4:34 PM IST

Highest Paying Jobs In India : మన దేశంలో చాలా మంది అధిక జీతం ఇచ్చే ఉగ్యోగాలు వెతక్కుంటూ విదేశాలకు వెళుతుంటారు. కానీ సరైన నైపుణ్యాలు, విద్యార్హతలు, అనుభవం ఉంటే భారత్​లోనే అధిక వేతనాలు పొందొచ్చు. ఏడాదికి రూ.70 లక్షల వరకు వార్షిక వేతనాన్ని తీసుకోవచ్చు. మరి అలాంటి ఉద్యోగాలు, వృత్తులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

1. పైలట్ : పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు మన దేశంలో విమానయాన రంగం అభివృద్ది చెందుతోంది. దీంతో పైలట్​లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే పైలట్ కూడా మంచి కెరీర్​ కెరీర్​ ఆప్షన్. 2023లో అనేక విమానయాన సంస్థలు సుశిక్షితులైన పైలట్లకు ఏడాదికి రూ.70 లక్షల వరకు వేతనం అందించాయి. వాణిజ్య, సైనిక పైలట్​లు కెరీర్ ప్రారంభంలోనే రూ.9 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటారు.

విద్యార్హత : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసినవారు, ఏవియేషన్ కోర్సులు చేసి పైలట్ కావచ్చు.

2. బిజినెస్ అన‌లిస్ట్‌ : ఈ ఆర్థిక ప్రపంచంలో బిజినెస్ అనలిస్ట్​లుగా రాణించడం అంత ఈజీ కాదు. అందుకే చాలా తక్కువ మంది బిజినెస్ అనలిస్ట్ కెరీర్​ను ఎంచుకుంటారు. మ‌న దేశంలో వ్యాపారాల మ‌ధ్య పోటీ రోజురోజుకి పెరిగిపోతుంది. మార్కెట్‌లో సంస్థల మ‌ధ్య పోటీత‌త్వాన్ని విశ్లేషించేందుకు బిజినెస్ అనలిస్ట్ అవ‌స‌రం ఎంతైనా ఉంది. బిజినెస్ అనలిస్ట్, రిలేషన్ షిప్ మేనేజర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, రిస్క్ మేనేజర్ వంటి ఉద్యోగులు ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ.34 లక్షల వరకు జీతాన్ని పొందుతున్నారు.

విద్యార్హత : డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బ్యాంకింగ్ ఆపరేషన్స్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సేల్స్​పై సమగ్ర పరిజ్ఞానం కలిగి ఉండాలి.

3. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. ఏఐ టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యోగాలు ఊడుతున్నాయి. అయితే ఏఐ, మెషిన్​ లెర్నింగ్ ఇంజినీర్స్​కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 2023లో ఓటీటీ ఫ్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్ తన అధికారిక వెబ్​సైట్‌ లో మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల్లో జాబ్​కు సంబంధించి ఓ పోస్ట్ చేసింది. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల్లో అనుభవం ఉన్న మేనేజర్ కావాలని పోస్ట్​లో పేర్కొంది. ఈ ఉద్యోగానికి ఏడాదికి రూ.2.4 కోట్ల నుంచి రూ.7.4 కోట్ల వేతనాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిని బట్టే అర్థం అయ్యి ఉంటుంది మీకు, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ ఉద్యోగానికి ఉన్న ప్రాముఖ్యత. ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ దాదాపు రూ. 45 లక్షల వార్షిక వేతనాన్ని సంపాదించవచ్చు.

విద్యార్హత : ఏఐ, మెషిన్ లెర్నింగ్ లేదా సంబంధిత రంగాల్లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారు ఈ ఉద్యోగాలు పొందవచ్చు.

4. సాఫ్ట్​వేర్ ఆర్కిటెక్ట్ : మనదేశంలో సాఫ్ట్​​వేర్ ఉద్యోగాలకు ఉన్నంత డిమాండ్ మరే రంగానికి లేదంటే, అది అతిశయోక్తి కాదు. అందులోనూ సాఫ్ట్​​వేర్ ఆర్కిటెక్ట్​లకు మరీ డిమాండ్ ఎక్కువ. మంచి నైపుణ్యం ఉంటే, ఏడాదికి రూ.32 లక్షల వరకు వేతనంతో ఈ ఉద్యోగం పొందవచ్చు.

విద్యార్హత : కంప్యూటర్ సైన్స్ డిగ్రీతోపాటు, సాఫ్ట్​వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్​​లో మంచి పట్టున్నవారికి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

5. డేటా సైంటిస్ట్
ప్రస్తుతం మన దేశంలో డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. డేటా అనాలిసిస్, ఆల్గారిథమ్స్ క్రియేషన్ మొదలైన అంశాల్లో పట్టున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఏడాదికి రూ.14 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వేతనాన్ని పొందొచ్చు.

సైన్స్​ & టెక్నాలజీ టు మార్కెటింగ్, ఏదైనా ఇక్కడ నేర్చుకోవచ్చు​! టాప్​-30 ఆన్​లైన్​ లెర్నింగ్​ వెబ్​సైట్స్​ ఇవే! - Top Online Learning Websites List

డిప్లొమా, ఐటీఐ అర్హతతో BELలో జాబ్స్​- దరఖాస్తుకు లాస్ట్​ డేట్​ ఇదే! - BEL Recruitment 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.