ETV Bharat / education-and-career

లక్షల్లో జీతాలు ఇచ్చే ఉద్యోగం చేయాలా? టాప్​-7 జాబ్​ ఆప్షన్స్ ఇవే! - top 10 Highest Paying Jobs 2024

Highest Paying Jobs In India 2024 In Telugu : చదువు పూర్తయిన తర్వాత మంచి జాబ్ చేయాలని అందరూ ఆశపడతారు. మరి మీరు కూడా భారీగా జీతం ఇచ్చే ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. నేడు లక్షల్లో జీతాలు అందిస్తున్న టాప్​-7 జాబ్​ ఆప్షన్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

jobs highest salary
Highest paying Jobs in India 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 10:53 AM IST

Highest Paying Jobs In India 2024 : ఉన్నత విద్య అభ్యసించి, మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశించే అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేడు అనేక ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు జీతభత్యాలు అందించే కెరీర్ ఆప్షన్స్​ నేడు అందుబాటులో ఉన్నాయి. కనుక నిరుద్యోగులు ఆయా రంగాల్లో మంచి నైపుణ్యాలు సంపాదిస్తే, కచ్చితంగా లక్షల్లో వేతనం ఇచ్చే ఉద్యోగాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం మన దేశంలో మంచి డిమాండ్​ ఉన్న, భారీ వేతనాలు ఇచ్చే టాప్​-7 ఉద్యోగాల గురించి తెలుసుకుందాం.

సాఫ్ట్​వేర్ ఆర్కిటెక్ట్
మనదేశంలో సాఫ్ట్​వేర్ ఉద్యోగాలకు ఉన్నంత డిమాండ్ మరే రంగానికి లేదంటే, అది అతిశయోక్తి కాదు. అందులోనూ సాఫ్ట్​వేర్ ఆర్కిటెక్ట్​లకు మరీ డిమాండ్ ఎక్కువ. మంచి నైపుణ్యం ఉంటే, ఏడాదికి రూ.32 లక్షల వరకు వేతనంతో ఈ ఉద్యోగం పొందవచ్చు. వెబ్​సైట్ డిజైనింగ్, టెస్టింగ్, సాఫ్ట్​వేర్ సమస్యలను పరిష్కరించడం, సైబర్ భద్రత లాంటి అంశాల్లో పట్టు ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంది. కంప్యూటర్ సైన్స్ డిగ్రీతోపాటు, సాఫ్ట్​వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్​లో మంచి పట్టున్నవారికి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషన్ లెర్నింగ్ ఇంజనీర్స్
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. AI టెక్నాలజీతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉద్యోగాలు ఊడుతున్నాయి. అయితే AI, మెషిన్​ లెర్నింగ్ టెక్నాలజీస్​ నిపుణులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ ఉద్యోగాలకు ఏడాదికి రూ.45 లక్షల వరకు వేతనం ఆఫర్ చేస్తున్నారు. AI టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసి, మెషిన్ లెర్నింగ్ లేదా సంబంధిత రంగాల్లో బాగా అనుభవం ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంది.

డేటా సైంటిస్ట్
ప్రస్తుతం మన దేశంలో డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. డేటా అనాలిసిస్, పాట్రన్స్​ ఐడెంటిఫికేషన్, ఆల్గారిథమ్స్ క్రియేషన్, ఇన్నోవేషన్స్ ఆఫ్ బిగ్​డేటా మొదలైన అంశాల్లో పట్టున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఏడాదికి రూ.14 లక్షల నుంచి రూ.25 లక్షలు చెల్లిస్తున్నారు. పనితనంతోపాటు, అనుభవానికి తగ్గట్టు వేతనం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు డేటా సైన్స్​ డిగ్రీతోపాటు, స్పెషలైజ్డ్​ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యత ఉంటుంది.

డిజిటల్ మార్కెటింగ్
స్మార్ట్​ఫోన్ల యుగంలో అంతా డిజిటల్ మయం అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏ మాత్రం సమయం దొరికినా డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లి గంటలకొద్దీ సమయం గడుపుతున్నారు. యూట్యూబ్, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సైట్లతోపాటు, ఓటీటీ లాంటి డిజిటల్ ఫ్లాట్​ఫామ్స్​లో సినిమాలు, వెబ్ సిరీస్​లు చూస్తున్నారు. దీంతో చాలా కంపెనీలు తమ ప్రొడక్టుల గురించి ప్రచారం చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ సంస్థలను ఆశ్రయిస్తున్నాయి. ఎవరైనా సరే ఎలాంటి సమాచారం కోసమైనా ఇప్పుడు డిజిటల్ మార్గాన్నే ఆశ్రయిస్తుండటం వల్ల రానురాను డిజిటల్ మార్కెటింగ్​కు బాగా డిమాండ్ పెరుగుతోంది. మార్కెటింగ్​ స్ట్రాటజీ, క్రియేటివిటీ, డేటా అనాలసిస్​, మార్కెటింగ్ టెక్నిక్స్ తెలిసిన వారికి డిజిటల్ మార్కెటింగ్​లో అవకాశాలు కోకొల్లలు. అనుభవాన్ని అనుసరించి ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు, మాస్టర్స్ డిగ్రీలతోపాటు, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజ్డ్​ కోర్సులు చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది.

పైలట్
పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు మన దేశంలో విమానయాన రంగం అభివృద్ది చెందుతోంది. దీంతో పైలట్​లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సుశిక్షితులైన పైలట్లకు ఏడాదికి రూ.70 లక్షల వరకు వేతనం అందిస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసినవారు, ఏవియేషన్ కోర్సులు చేసి పైలట్ కావచ్చు.

గ్రీన్ స్పెషలిస్ట్
పర్యావరణ పరిరక్షణ కోసం నేడు గ్రీన్ స్పెషలిస్టుల అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణల కోసం కొన్ని వర్సిటీలు గ్రీన్ స్పెషలిస్టు కోర్సులను అందిస్తున్నాయి. వ్యర్థాల నుంచి పునరుత్పాదక విద్యుత్​ను, రోడ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్​ను తయారు చేయడం లాంటివి ఈ గ్రీన్స్ స్పెషలిస్టుల విధి. ఈ ఉద్యోగాలకు రూ.4 లక్షల నుంచి రూ.40 లక్షలు వరకు వేతనాలు చెల్లిస్తున్నారు.

ఫైనాన్స్ ఫ్రొఫెషనల్స్
బిజినెస్ అనలిస్టులు, ఫైనాన్సియల్ అనలిస్టులు, రిస్క్ మేనేజర్​, రిలేషన్​షిప్​ మేనేజర్​, బ్రాంచ్​ మేనేజర్ లాంటి ఫైనాన్స్ ప్రొఫెషనల్స్​కు, ఛార్టెడ్ అకౌంటెట్లు, కంపెనీ సెక్రటరీలకు మనదేశంలో చాలా డిమాండ్ ఉంది. ఆర్థిక నిర్వహణ ప్రతి వ్యవస్థకు ముఖ్యం. సరైన ఆర్థిక నిర్వహణ లేకపోతే ఎంతటి పెద్ద వ్యవస్థ అయినా కూలిపోవడం ఖాయం. అందుకే కంపెనీలు మంచి ఆర్థిక నిపుణుల కోసం నిరంతరం అన్వేషిస్తుంటాయి. ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.34 లక్షల వేతనం చెల్లించే ఈ పోస్టులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

Best Job Tips For Freshers : తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సంపాదించాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే జాబ్ గ్యారెంటీ!

How To Success In Interview : ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా?.. ఈ టిప్స్​ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.