ETV Bharat / education-and-career

ఈ ఐదు AI కోర్సులు చేస్తే చాలు - లక్షల్లో సాలరీ గ్యారెంటీ! - High Paying AI Jobs - HIGH PAYING AI JOBS

High Paying AI Jobs : ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ (ఏఐ) వెంట ప్రపంచం మొత్తం పరుగులు పెడుతోంది. విద్య, వైద్యం, వ్యాపారం ఇలా పలు రంగాలకు ఏఐ విస్తరిస్తోంది. భవిష్యత్​లో కూడా ఏఐకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే మంచి జీతంతో జాబ్ రావాలంటే తప్పక నేర్చుకోవాల్సిన ఐదు ఏఐ కోర్సులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

High-Paying AI Jobs
High-Paying AI Jobs (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 1:39 PM IST

High Paying AI Jobs : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే అన్ని రంగాలకు వ్యాపించిన ఏఐ ప్రపంచ రూపురేఖలను మార్చేస్తోంది. భవిష్యత్​లో కూడా దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​కు సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయి. పైగా మంచి సాలరీ కూడా వస్తుంది. అందుకే ఆ ఆర్టికల్​లో భవిష్యత్​లో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఐదు ముఖ్యమైన ఏఐ కోర్సులు గురించి తెలుసుకుందాం.

1. మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్
మెషిన్​ లెర్నింగ్ ఇంజినీర్స్​కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏఐ ఇన్నోవేషన్​లో కీలక భూమిక పోషిస్తారు. వీరు ప్రధానంగా ఏఐ అల్గారిథమ్స్​ను రూపొందిస్తారు. ఆటోమెటిక్ వాహనాలు, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్‌ రంగాల్లోనూ వీరి పాత్ర చాలా కీలకం. మెషిన్​ లెర్నింగ్ ఇంజినీర్స్ తమ ఉద్యోగంలో బాగా రాణించాలంటే, బలమైన అనలెటికల్ స్కిల్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్​పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. అలాగే భారీ డేటా సెట్స్​ను విశ్లేషించగలగాలి. అందుకే ఈ సామర్థ్యాలు అన్నీ ఉన్న మెషిన్ లెర్నంగ్ ఇంజినీర్స్​కు లక్షల్లో జీతం ఉంటుంది.

2. రోబోటిక్స్ ఇంజినీర్స్
రోబోటిక్స్ ఇంజినీర్లు స్వయం ప్రతిపత్తితో పనిచేసే ఇంటిలిజెంట్ మెషీన్లను రూపొందిస్తుంటారు. తయారీ, ఆరోగ్య సంరక్షణ వంటి పలు రంగాల్లో రోబోటిక్స్ ఇంజినీర్స్ అవసరం అవుతారు. ఆటోమేషన్​కు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, మంచి నైపుణ్యం కలిగిన రోబోటిక్స్ ఇంజినీర్స్​ కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల వీరికి కూడా లక్షల్లో జీతాలు లభిస్తాయి.

3. డేటా సైంటిస్ట్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. సంక్లిష్ట డేటా సెట్​లను విశ్లేషించడంలో డేటా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. మార్కెటింగ్, ఆరోగ్య సంరక్షణ వంటి పలు రంగాల్లో డేటా సైంటిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. డేటా అనాలసిస్, పాట్రన్స్​ ఐడెంటిఫికేషన్, ఆల్గారిథమ్స్ క్రియేషన్​ స్కిల్స్ ఉన్న డేటా సైంటిస్ట్​లకు భారీ స్థాయిలో జీతభత్యాలు లభిస్తాయి.

4. ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్
రీసెర్చ్ సైంటిస్టులు ఏఐ సైద్ధాంతిక అంశాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు. వారు అకడమిక్ సెట్టింగ్, ఆర్ అండ్ డీలో కొత్త మోడల్స్, పద్ధతులను అభివృద్ధి చేయడానికి అత్యాధునిక పరిశోధనలు చేస్తారు. కనుక వారికి న్యూరల్ నెట్‌వర్క్​లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ నైపుణ్యాలు ఉండి తీరాలి. కనుక ఈ స్కిల్స్ ఉన్నవారికి లక్షల్లో సాలరీ లభిస్తుంది.

5. ఏఐ ప్రోడక్ట్ మేనేజర్
బిజినెస్ అవసరాలకు అవసరమైన ఏఐ సాంకేతికతను ఏఐ ప్రోడక్ట్ మేనజర్లు పర్యవేక్షిస్తుంటారు. అంటే వ్యాపారానికి, సాంకేతికకు మధ్య ఒక వారధిగా వారు పనిచేస్తుంటారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిని పర్యవేక్షించి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అవి ఉండేలా చూస్తారు. మీరికి కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కనుక ఆకర్షణీయమైన సాలరీలను పొందవచ్చు.

గమనిక : పైన పేర్కొన్న ఐదు కోర్సులను కేవలం నామమాత్రంగా చదివితే ఆకర్షణీయమైన ఉద్యోగాలు రావు. ఆ కోర్సులు చేసి, మంచి స్కిల్స్ నేర్చుకుంటేనే మంచి సాలరీతో ఉద్యోగాన్ని సంపాదించి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడానికి వీలవుతుంది.

ప్రపంచ రూపురేఖలను మార్చేస్తున్న ఏఐ - ఈ కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా! - CSE Head Rajeswara Rao Interview

ప్రాంప్ట్‌ ఇంజినీర్స్‌కు ఫుల్ డిమాండ్- బడా కంపెనీల్లో సూపర్ ప్యాకేజీ- అర్హతలేంటి? - AI Prompt Engineers Recruitment

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.