GAIL Recruitment 2024 : మహారత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ- 'గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (GAIL) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో కింది విభాగాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు : నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 391 (యూఆర్- 174, ఈడబ్ల్యూఎస్- 29, ఓబీసీ- 89, ఎస్సీ- 60 ఎస్టీ- 39)
- జూనియర్ ఇంజినీర్ (కెమికల్) : 2 పోస్టులు
- జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) : 1 పోస్టు
- ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) : 1 పోస్టు
- ఫోర్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) : 14 పోస్టులు
- ఫోర్‌మ్యాన్ (సివిల్) : 6 పోస్టులు
- జూనియర్ సూపరింటెండెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) : 5 పోస్టులు
- జూనియర్ కెమిస్ట్ : 8 పోస్టులు
- జూనియర్ అకౌంటెంట్ : 14 పోస్టులు
- టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ) : 3 పోస్టులు
- ఆపరేటర్ (కెమికల్) : 73 పోస్టులు
- టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) : 44 పోస్టులు
- టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) : 45 పోస్టులు
- టెక్నీషియన్ (మెకానికల్) : 39 పోస్టులు
- టెక్నీషియన్ (టెలికాం & టెలిమెట్రీ) : 11 పోస్టులు
- ఆపరేటర్ (ఫైర్) : 39 పోస్టులు
- ఆపరేటర్ (బాయిలర్) : 08 పోస్టులు
- అకౌంట్స్ అసిస్టెంట్ : 13 పోస్టులు
- బిజినెస్ అసిస్టెంట్ : 65 పోస్టులు
- మొత్తం పోస్టుల సంఖ్య : 391.
విద్యార్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్, బీబీఎం, బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
జీత భత్యాలు :
- జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000 - రూ.1,38,000.
- జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000 - రూ.1,20,000.
- మిగిలిన పోస్టులకు రూ.24,500 - రూ.90,000.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.50 చెల్లించాలి. దివ్యాంగ అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 8
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్ 7
అమెరికాలో చదువుకోవాలా? అక్కడి జీవన వ్యయాలపై సమగ్ర సమాచారం మీ కోసం! - Cost of Studying in America