EPFO Jobs 2024 : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లోని 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేటగిరీల వారీగా ఉద్యోగాల వివరాలు
- యూఆర్ - 132 పోస్టులు
- ఓబీసీ - 87 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 32 పోస్టులు
- ఎస్టీ - 24 పోస్టులు
- ఎస్సీ - 48 పోస్టులు
- మొత్తం పోస్టులు - 323
విద్యార్హతలు
EPFO PA Job Qualification : బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ (ఇంగ్లీష్/హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి
EPFO PA Job Age Limit : అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 18 ఏళ్లు ఉండాలి. అయితే గరిష్ఠ వయస్సు అనేది ఆయా కేటగిరీలను బట్టి మారుతూ ఉంటుంది. అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు 33 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు; దివ్యాంగులకు 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము
EPFO PA Job Application Fee : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.25 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
EPFO PA Job Selection Process : అభ్యర్థులకు ముందుగా రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలు చేసి, అర్హులైన వారిని ఈపీఎఫ్ఓ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
EPFO PA Salary : ఈపీఎఫ్ పర్సనల్ అసిస్టెంట్లకు నెలకు రూ.44,900 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం
EPFO PA Job Application Process :
- అభ్యర్థులు ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://upsconline.nic.in/ ఓపెన్ చేయాలి.
- మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
- అప్పుడు మీ ఈ-మెయిల్, ఫోన్ నంబర్లకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు వస్తాయి.
- వీటిని ఉపయోగించుకుని మళ్లీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- ఫొటో, సిగ్నేచర్ సహా అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
మఖ్యమైన తేదీలు :
EPFO PA Job Apply Last Date
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 మార్చి 27
- దరఖాస్తు సవరణ తేదీలు : 2024 మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు.
పరీక్ష కేంద్రాలు :
- ఏపీలోని పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం
- తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్
THDCILలో 100 ఇంజినీర్ పోస్టులు - లక్షల్లో జీతం - అప్లై చేసుకోండిలా!
ఫ్రీలాన్సర్‌గా పని చేయాలా? ఈ టాప్-10 వెబ్‌సైట్స్‌పై ఓ లుక్కేయండి!